Ads
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఒకరు. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
Video Advertisement
ఈ సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తదుపరి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ వ్యక్తిగత విషయానికి వస్తే… ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఈయనకు అభయ్ రామ్ భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
ఇక ఎన్టీఆర్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా బిందాస్ గా గడపడానికి ఇష్టపడతారు ఖరీదైన కార్లు బంగ్లాలు వస్తువులను ఈయన ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా తన కొడుకుల విషయంలో కూడా ఈయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్ కొడుకులకు సంబంధించినటువంటి ఒక విషయం వైరల్ అవుతుంది ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ ఐదవ తరగతి చదువుతున్నారు చిన్న కుమారుడు ఒకటో తరగతి చదువుతున్నాడు వీరిద్దరూ కూడా హైదరాబాద్లోనే ఒక కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు.
ఇకపోతే వీరిద్దరి చదువు కోసం ఎన్టీఆర్ ప్రతి ఏడాది ఖర్చు చేస్తున్నటువంటి ఫీజులు గురించి ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కొడుకులకి ఒక ఏడాదికి సుమారు 20 లక్షల రూపాయల వరకు ఫీజులు చెల్లిస్తున్నారంటే ఈ వార్త వైరల్ గా మారింది. ఇంత చిన్న వయసులోనే 20 లక్షలు అంటే మామూలు విషయం కాదు. ఒకటో తరగతికి ఈ స్థాయిలో ఫీజు కడుతున్నారు అంటే ముందు ముందు వీరి కోసం ఎన్టీఆర్ ఎంత ఖర్చు చేయబోతున్నారో స్పష్టంగా తెలుస్తుంది.
End of Article