లోకేష్-బ్రాహ్మణి పెళ్లి ఫొటోలో ఉన్న ఈ యంగ్ హీరో భార్యను గుర్తుపట్టారా.? అప్పుడు ఆమె ఎంత చిన్నగా ఉన్నారో చూడండి.!

లోకేష్-బ్రాహ్మణి పెళ్లి ఫొటోలో ఉన్న ఈ యంగ్ హీరో భార్యను గుర్తుపట్టారా.? అప్పుడు ఆమె ఎంత చిన్నగా ఉన్నారో చూడండి.!

by Mounika Singaluri

చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు నారా లోకేష్. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. నారా లోకేష్ 2007 లో బ్రాహ్మణిని పెళ్లి చేసుకున్నారు.

Video Advertisement

బ్రాహ్మణి నందమూరి బాలకృష్ణ పెద్ద కూతురు. వీరి పెళ్లి అప్పట్లో ఒక పెద్ద డిస్కషన్ అయ్యింది. అంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది అని అర్ధం.

సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పటి ఫోటోలు అయినా కూడా సడన్ గా బయటికి వస్తాయి. ఇప్పుడు వీరి పెళ్లి టైంకి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఈ ఫొటోలో, లోకేష్, బ్రాహ్మణితో పాటు మిగిలిన నారా, నందమూరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు కూడా ఉన్నారు. వీరిలో ఉన్న ఒక అమ్మాయి ఇప్పుడు మనందరికీ చాలా బాగా తెలుసు. ఆమె భర్త ఒక పెద్ద స్టార్ హీరో. ఆ అమ్మాయి ఎవరో ఈ పాటికి మీకే అర్ధం అయిపోయి ఉంటుంది. ఆమె మరెవరో కాదు నందమూరి ప్రణతి. ప్రణతి ఈ ఫొటోలో చాలా చిన్నగా ఉన్నారు.

అప్పటికి ప్రణతి వయసు 15 సంవత్సరాలు మాత్రమే. 2011 లో ప్రణతి, జూనియర్ ఎన్టీఆర్ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. భార్గవ్ రామ్, అభయ్ రామ్. ప్రణతి పెద్దగా బయట కనిపించరు. ఇంటర్వ్యూలకి అయితే అసలే రారు. కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్, పార్టీల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ప్రణతికి మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, రామ్ చరణ్ భార్య ఉపాసన చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీరిద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. వీరు పోస్ట్ చేసిన ఫొటోస్ లో అప్పడప్పుడు ప్రణతి కూడా కనిపిస్తారు.

ఇంక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో అంతకముందు జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కుడా ఉంది.


You may also like

Leave a Comment