“జులాయి” లో సోను సూద్ పక్కన నటించిన ఈమె గురించి చాలామందికి తెలియని విషయాలివే.!

“జులాయి” లో సోను సూద్ పక్కన నటించిన ఈమె గురించి చాలామందికి తెలియని విషయాలివే.!

by Mohana Priya

Ads

“క్లాస్ రూమ్ లో ఎవడైనా ఆన్సర్ చెప్తాడు…కానీ ఎక్జామ్ లో రాసేవాడే తోప్పేర్ అవుతాడు.” ఈ డైలాగ్ వినగానే మీకు అర్ధం అయ్యే ఉంటుంది మనం మాట్లాడుకోబోయేది “జులాయి” సినిమా గురించి అని. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో 2012 లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. జులాయి సినిమా మా టీవీ లో లెక్కలేనన్ని సార్లు వేసి ఉండొచ్చు. అయినా సరే ఇప్పటికి కూడా చాలామంది ఈ సినిమాని చూస్తారు. జులాయి కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.

Video Advertisement

ఈ సినిమాలో సోనూ సూద్ విలన్ అనే విషయం అందరికీ తెలుసు. సోనూ సూద్ పక్కన ఉండే, అలాగే రాబరీ లో, అలాగే మిగిలిన విషయాల్లో సోనూసూద్ కి సలహా ఇచ్చే ముఖ్య పాత్ర లో నటించారు శీతల్ మీనన్. జులాయి సినిమాలో మూగ చెవిటి పాత్రలో నటించి మెప్పించారు ఆమె.

2008లో హిందీలో వచ్చిన భ్రమ్ అనే సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టారు శీతల్ మీనన్. తర్వాత రెండు హిందీ సినిమాల్లో, అలాగే ఒక ఇండో చైనా సినిమాలో నటించిన శీతల్ మీనన్ జులాయి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఈ సినిమాలో శీతల్ మీనన్ పాత్ర పేరు దేవయాని.

తర్వాత బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో వచ్చిన డేవిడ్ సినిమాలో నటించారు. 2016 లో తమిళ్ లో ప్రశాంత్ హీరోగా జులాయి సినిమా సాహసం (సాగసం) పేరుతో రీమేక్ అయింది. ఆ సినిమాలో కూడా తెలుగులో పోషించిన పాత్రని పోషించారు శీతల్ మీనన్.

2015 లో శీతల్ మీనన్ ఇంకా బిజోయ్ నంబియార్ పెళ్లి చేసుకున్నారు. బిజోయ్ నంబియార్ సైతాన్, డేవిడ్, సోలో (మలయాళం) లాంటి సినిమాలకి దర్శకత్వం వహించారు, అలాగే కొన్ని సినిమాలకి ప్రొడ్యూసర్ గా, రైటర్ గా కూడా చేశారు. శీతల్ మీనన్ సినిమాల్లోనే కాకుండా ఫ్లిప్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు.


End of Article

You may also like