యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. క్రౌడ్ పుల్లింగ్ చేయగల కెపాసిటీ ఉన్న మాస్ హీరో. ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా గుర్తింపును తెచ్చుకున్నారు. 2001లో నిన్ను చూడాలని మూవీతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నంబర్ 1తో బ్రేక్ అందుకున్నారు.

Video Advertisement

అంతకుముందు బాలనటుడిగా బాల రామాయణం శ్రీ రామ చంద్రుడి పాత్ర లో మెరుపులు మెరిపించారు. టాలీవుడ్ లో మంచి టేస్ట్ ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు.

flop movies which rejected by Junior NTR..!!

అయితే ఎన్టీఆర్ కేవలం ఒక మంచి యాక్టర్ ఏ కాదని.. ఎన్టీఆర్ మంచి మనసున్న గొప్ప వ్యక్తని తాజాగా జరిగిన ఓ సన్నివేశం చెబుతోంది. ఇక అదేమిటనేది చూస్తే… నవంబర్ 1న రాష్ట్ర అసెంబ్లీలో కన్నడ రజదోత్సవ వేడుక జరిగింది. ఇందులో ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. రజినీ కాంత్ మొదలు ఎంతో మంది ప్రముఖులు ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్ఫోసిస్ ఛైర్మన్ సుధా మూర్తి కూడా వచ్చారు.

నిర్వాహకులు ఎన్టీఆర్ ని కూర్చోమని చెప్పారు. కానీ ఎన్టీఆర్ అక్కడ కూర్చోకుండా అక్కడ ఉన్న మహిళని సుధా మూర్తి ని కూడా స్వయంగా కుర్చీలను తుడిచి మరీ కూర్చోబెట్టారు. అయితే అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ మీద కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ మంచి హీరో మాత్రమే కాదు ఒక మంచి మనసున్న మనిషి అని తెలుస్తుంది.