Home Filmy Adda kaarthika Deepam: కార్తీకదీపం సీరియల్ వంటలక్క మళ్ళీ తల్లికాబోతోందా…?

kaarthika Deepam: కార్తీకదీపం సీరియల్ వంటలక్క మళ్ళీ తల్లికాబోతోందా…?

by Sunku Sravan

కార్తీకదీపం సీరియల్ ఎంతటి క్రేజ్ ను సంపాదించుకుందో మనందరికీ తెలిసిన విషయమే. సాయంత్రం అయితే చాలు ఎపుడు వస్తుందా ఆ సీరియల్ అని ఎదురు చూస్తూ ఉంటారు.అత్యంత టాప్ రేటింగ్ ఉన్న సీరియల్ గా గుర్తింపు తెచ్చుకుని అందరి మన్ననలు పొందుతోంది.అయితే ఈ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ భామ ప్రేమి విశ్వనాధ్ వంటలక్క గా మనఇంట్లో మనిషి గా కలిసిపోయింది.

karthikadeepam

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హీరో గా , లింగ స్వామి దర్శకత్వం లో రాబోతున్న సినిమా లో వంటలక్క నటించబోతున్నారు .ఈ సినిమా లో నటించడానికి వంటలక్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది .లింగ స్వామి స్వయంగా ప్రేమి ఇంటికి వెళ్లి పాత్రను వివరించారు .కణం సినిమా తరహాలో హార్రర్ థ్రిల్లర్ కధాంశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ​.ఈ సినిమా లో వంటలక్క ఒక చిన్నారికి తల్లిగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. కార్తీక దీపం సీరియల్ లో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటిస్తున్న వంటలక్క మరోసారి తల్లిగా నటించబోతున్నారు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

You may also like