కడపలో TDP నుండి పోటీ చేసి గెలిచిన ఈ మహిళ ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

కడపలో TDP నుండి పోటీ చేసి గెలిచిన ఈ మహిళ ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by Harika

Ads

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ మెజారిటీలో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసిన ఎంతో మంది విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం లో ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో వీరి ఇంటి దగ్గర సంబరాలు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు కూడా గెలిచారు. వారిలో రెడ్డప్ప గారి మాధవి కూడా ఒకరు.

Video Advertisement

kadapa tdp contender reddeppagari madhavi

కడప నుండి పోటీ చేసిన మాధవి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఇప్పుడు మాధవి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మాధవి అందరికీ తెలిసింది ఇప్పుడే అయినా కూడా, ఎన్నో సంవత్సరాల నుండి రాజకీయాల్లో తన వంతు కృషి చేస్తున్నారు. మాధవి భర్త శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి పొలిట్ బ్యూరో మెంబర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల మాధవిని తెలుగుదేశం పార్టీ కడప ఇంచార్జ్ గా ప్రకటించారు. మాధవి 1998 నుండి క్యాంపెనింగ్ చేసేవారు. 2014 లో శ్రీనివాస రెడ్డికి ఎంపీగా టికెట్ ఇచ్చినప్పుడు మద్దతుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాధవి స్వస్థలం కర్నూల్ లోని కోయిలకుంట్ల.

కానీ మాధవి ఎక్కువ కడపలో పెరిగారు. మాధవి తండ్రి ట్రాన్స్ఫర్స్ కారణంగా మాధవి వివిధ స్కూల్స్ లో చదువుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదివారు. అందులోనే ఎం.ఏ ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. మాధవికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. అమ్మాయి విజయవాడలో డాక్టర్ చదువుతున్నారు. అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. మాధవి ఒక వ్యాపారవేత్త కూడా. శ్రీనివాస్ రెడ్డి మాధవిని ఎంతో ప్రోత్సహించారు అని మాధవి తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ పనులు తనని చూసుకోమని మాధవికి చెప్పారట.

2002 నుండి మాధవి ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవడం మొదలుపెట్టారు. 2014 లో శ్రీనివాస్ రెడ్డి రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఆఫీస్ పని చూసుకున్నారు. వీరికి ఒక ఇన్ఫ్రా కంపెనీ ఉంది. దీని నుండి రైల్వే పనులు, రోడ్ పనులు, ఇరిగేషన్ కి సంబంధించిన పనులు చేస్తూ ఉంటారు. వీటి వ్యవహారాలన్నీ కూడా మాధవి హైదరాబాద్ నుండి చూసుకున్నారు. కన్స్ట్రక్షన్ కి అయ్యే పనులు అన్నీ కూడా మాధవి చూసుకుంటారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అడుగు పెట్టి కడప ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంతో మంది ప్రముఖులు మాధవికి అభినందనలు తెలుపుతున్నారు.


End of Article

You may also like