KGF చాప్టర్-2 కి… “కైకాల సత్యనారాయణ”కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

KGF చాప్టర్-2 కి… “కైకాల సత్యనారాయణ”కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

by Sunku Sravan

Ads

ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి సినిమాలు పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయి ప్రేక్షకులకు సినిమా ఫీవర్ తెప్పిస్తున్నాయి. అయితే పుష్ప సినిమా రిలీజ్ తర్వాత కొద్ది రోజులు ప్రేక్షకులు ఎక్కడ చూసినా దాని గురించే మాట్లాడుకున్నారు.

Video Advertisement

ఆ తర్వాత భారీ అంచనాల నడుమ ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అయింది. బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించి ఎంతోమంది హృదయాలను దోచుకుంది.

ఈ క్రమంలోనే మళ్లీ కేజిఎఫ్ 2 ప్రస్తుతం దీని గురించే జనాల్లో ఎక్కడ చూసినా గుసగుసలు వినిపిస్తున్నాయి. రాఖీ బాయ్, రాఖీ బాయ్ అంటూ మాట్లాడు కుంటున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి చాలా సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్ ఒక సంచలన విషయాన్ని తెలియజేశారు. అది ఏంటో చూద్దాం..!! తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన కేజిఎఫ్ సినిమా గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

కేజిఎఫ్ మూవీలో ప్రకాష్ రాజు పాత్రను ఏదో సినిమా రేటింగ్ పెంచడం కోసం ఇరికించినట్లు ఉందా లేదా కన్విన్సింగ్ గా ఉందా అని అడిగారు..? ఆ పాత్రను ఇరికించడం ఏమీ కాదు. అది కన్విన్సింగ్ గానే ఉన్నది, కథలో మరింత ఆసక్తిని పెంచడం కోసం ఆ పాత్రను సృష్టించడం జరిగింది. అయితే ఆ జర్నలిస్టు రాఖీ బాయ్ నిజ జీవితంలో జరిగిన కథను రాయడం కోసం ఎంతగా కష్టపడ్డారో.. ఇలా సమాచారాన్ని సేకరించాడు.

ఈ సందర్భంగా తన కుటుంబాన్ని కూడా పట్టించుకోడు. అంతగా కనెక్ట్ అయిపోయి ప్యూర్ రియాలిటీ కథను అందించడం కోసం ఎంతో కృషి చేసారు అనేది తెలియడం కొరకే కొడుకుగా ప్రకాష్ రాజు పాత్ర ప్రవేశపెట్టినట్లు తెలుస్తున్నది. అందుకే ఆ పాత్ర మంచి రిజల్ట్ వచ్చి అనుకున్నది సాధించిందన్నారు భరద్వాజ్. అలాగే సంజయ్ దత్ గురించి మాట్లాడుతూ అధిర పాత్రను నటించడం కాదు జీవించారని, ఇలాంటి కొత్త పాత్రలను చేయడం సంజయ్ కి కొత్తేమీ కాదని అందుకే ఆయనను సెలక్ట్ చేశారని అన్నారు.

ఆయన కూడా అనుకున్న విధంగానే పర్ఫామెన్స్ తో స్థాయికి తగ్గట్టుగా విలన్ గా కనిపించాలని తెలియజేశారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి బాలీవుడ్ దర్శకులకు మరియు టాలీవుడ్ లోని దర్శకుడు రాజమౌళికి కూడా గట్టిపోటీని ఇచ్చినట్లు కనబడుతోందనీ ప్రశాంత్ నిల్ ను కొనియాడారు. అయితే ఈ మూవీని కైకల సత్యనారాయణ సమర్పించారు. అయితే కైకల సత్యనారాయణ ద్వారానే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా పరిచయం అయింది అని చెప్పాలి. కేజిఎఫ్ ఫస్ట్ పార్ట్ లో కైకల ఈ మూవీ గురించి మరియు యష్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు.


End of Article

You may also like