Ads
అక్టోబర్ చివరిలో కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు వివాహం జరిగింది అన్న విషయం అందరికి తెలిసిందే. పెళ్లి వేడుకలు మొదలైనప్పటి నుంచి ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మన అందరితో షేర్ చేసుకున్నారు కాజల్. మెహందీ, హల్దీ తో పాటు వాళ్ళ ఇంట్లో జరిగిన పూజ, తర్వాత పెళ్లి, రిసెప్షన్ ఇలా అన్ని సందర్భాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కాజల్ అగర్వాల్.
Video Advertisement
అలాగే తనని ఎంతగానో ఆదరించిన తెలుగు వాళ్ళపై తనకి ఉన్న అభిమానాన్ని చూపిస్తూ పెళ్లిలో తెలుగు సంప్రదాయం అయిన జీలకర్ర బెల్లం పద్ధతిని కూడా పాటించారు. పెళ్లి తర్వాత కాజల్, గౌతమ్ మాల్దీవ్స్ కి వెళ్లారు. నీటి అడుగున ఉన్న “ది మురాకా హోటల్” లో వీరిద్దరూ బస చేశారు. ఈ హోటల్ లో ఉండడానికి ఒక్క రాత్రికి దాదాపు 38 లక్షల ఖర్చు అవుతుంది. కానీ వీళ్ళిద్దరికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. అందుకు కారణం ఏంటంటే.
మాల్దీవ్స్ ప్రభుత్వం, తమ పర్యాటక స్థలాలని విదేశీయులకి, అందులోనూ ముఖ్యంగా భారతీయులకు చేరువ చేయాలి అని అనుకుంది. అందుకే ఒకవేళ మాల్దీవ్స్ కి వెళ్ళిన సెలబ్రిటీకి ఇంస్టాగ్రామ్ లో 2 మిలియన్ల కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉంటే, వారు ఏ హోటల్ లో బస చేస్తే ఆ హోటల్ లో ఫైవ్ స్టార్ భోజనం ఉచితంగా అందిస్తారు.
అదే 5 మిలియన్ల కంటే ఎక్కువమంది ఫాలోవర్లు ఉంటే హోటల్ రూమ్, భోజనం, ఫ్లైట్ టికెట్లు, అన్ని ఫ్రీ. కాజల్ వివాహం జరిగింది అని తెలుసుకున్న మురాకా హోటల్ యాజమాన్యం కాజల్ ని సంప్రదించి ఈ ప్యాకేజ్ గురించి వివరించారు. మాల్దీవ్స్ ఎంత బాగున్నాయో ఈపాటికే మనం కాజల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ లో చూసే ఉంటాం.
End of Article