Ads
ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న టాపిక్ ఒకటే. అదే కాజల్ అగర్వాల్ పెళ్లి టాపిక్. సడన్ గా 2 రోజుల క్రితం కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంటున్నారు అనే వార్త మొదలైంది. అదే రోజు కాజల్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ బహుశా ఆ వార్త నిజమేనేమో అని అనిపించేలా ఉంది. నిన్న ఇంక సోషల్ మీడియా ద్వారా తను పెళ్లి చేసుకుంటున్న విషయం కాజల్ అగర్వాల్ ప్రకటించారు.
Video Advertisement
ఆ పోస్ట్ లో అక్టోబర్ 30వ తేదీన ముంబై లో కేవలం వాళ్ల కుటుంబ సభ్యుల (ఇమీడియట్ ఫామిలీస్) సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది అని కాజల్ చెప్పారు. కాజల్ ఇంకా గౌతమ్ ది అరేంజ్డ్ లవ్ మ్యారేజ్. గౌతమ్ కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ లో చదువుకున్నారు. తర్వాత టఫ్ట్స్ యూనివర్సిటీలో ఆ తర్వాత ఇన్ సీడ్ లో చదువుకున్నారు.
గౌతమ్ డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోకి ఫౌండర్. డిసెర్న్ లివింగ్ మొదలు పెట్టక ముందు, ఫ్యాబ్ ఫర్నిష్ కి వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే లైఫ్ స్టైల్ బ్రాండ్ – ద ఎలిఫెంట్ కంపెనీ కి సీఈఓ గా ఉన్నారు.
గౌతమ్ మంచి రన్నర్ కూడా. ముంబైలో మారథాన్ లలో పాల్గొంటూ ఉంటారు. కాజల్ ఇంకా గౌతమ్ చిన్నప్పటి నుండి స్నేహితులు. వీరి స్నేహం ప్రేమగా మారింది.
End of Article