Ads
సోషల్ మీడియా లో యాక్టి వ్ గా ఉండే సెలబ్రిటీలలో ఒకరు కాజల్ అగర్వాల్. తన సినిమాలకు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా విషయాలని కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
Video Advertisement
అయితే, “కాజల్ అగర్వాల్ తల్లి కాబోతున్నారా?” అంటూ సోషల్ మీడియాలో గత కొంత కాలం నుండి చాలా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల కాజల్ మాట్లాడుతూ, “దీని గురించి నేను ప్రస్తుతం మాట్లాడాలి అనుకోవట్లేదు. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను” అని అన్నారు.
ఈ నేపథ్యంలో కాజల్ ఇవాళ సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేశారు. “సోషల్ మీడియాలో ఏది షేర్ చేస్తే అదే వారి జీవితం అని అందరూ అనుకుంటారు అని, ఏ వ్యక్తిగత సంబంధం లేకపోయినా కూడా జనాలు అవతలవారి జీవితంపై హక్కు ఉన్నట్లు భావిస్తారు అని, కానీ సోషల్ మీడియాలో షేర్ చేయని విషయాలు కూడా చాలా ఉంటాయి అని, వారి జీవితంలో జరిగే విషయాలన్నిటినీ సోషల్ మీడియాలో ప్రకటించని మనుషులు చాలా మంది ఉంటారు” అని అర్థం వచ్చే ఒక పోస్ట్ ని కాజల్ షేర్ చేశారు. కాజల్ ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2022లో విడుదల కాబోతోంది.
End of Article