Ads
నటి కాజల్ అగర్వాల్ తాను తల్లి కాబోతున్నట్టు ఇటీవల సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తర్వాత చాలామంది కాజల్ కి విషెస్ చెబుతూ పాజిటివ్ కామెంట్స్ చేశారు. కానీ కొన్ని చోట్ల మాత్రం నెగిటివ్ కామెంట్ వస్తున్నాయి. కాజల్ ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు. దుబాయ్ కి హాలిడేకి వెళ్ళిన కాజల్ సోషల్ మీడియా ద్వారా తన గురించి చెబుతూ ఉన్నారు.
Video Advertisement
హాలిడేకి సంబంధించిన ఒక ఫోటో షేర్ చేస్తూ కాజల్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి చెప్పారు. కాజల్ ఈ విధంగా రాశారు “నా జీవితంలో చాలా మంచి మార్పులు ఎదుర్కొంటున్నాను. అందులోనూ ముఖ్యంగా నా శరీరంలో, కుటుంబంలో, నా వృత్తిలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కామెంట్స్/ బాడీ షేమింగ్ మెసేజెస్/ మీమ్స్ నేను ఎక్కువగా పట్టించుకోను.”
image source: instagram (kajalaggarwalofficial)
“అందరిపై దయతో ఉండడం నేర్చుకుందాం. నాలాగే పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు, అలాగే ఏ విషయం అర్థం కాని మూర్ఖులు ఉన్నారు. వారి కోసం నేను నా గురించి, నా ఆలోచనల గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో చాలా మార్పులు ఎదురవుతాయి. కొంతమందికి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. మొటిమలు వస్తాయి. మామూలు సమయం కంటే కూడా ఇలాంటి సమయంలో ఎక్కువ అలసిపోతుంటారు. మూడ్ కూడా తొందరగా మారుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో నెగటివ్ ఆలోచనలు అనేవి మన మూడ్ పై ప్రభావం చూపుతాయి. ఇది మన శరీరానికి మంచిది కాదు.”
image source: instagram (kajalaggarwalofficial)
“బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ అంతకు ముందు ఉన్న షేప్ కి రావాలి అంటే కష్టమే. కానీ పర్వాలేదు. ఇలాంటి మార్పులు సహజం. వీటివల్ల ఇలాంటి అద్భుతమైన క్షణాల్లో అసౌకర్యానికి గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి చేయకూడదు. ఒక జీవికి జన్మనిస్తున్నాం అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేను ఈ సమయంలో ఫాలో అవుతున్న కొన్ని పాయింట్స్ కూడా చెబుతున్నాను. ఇవన్నీ మీకు సహాయపడతాయని ఆశిస్తున్నాను” అని కాజల్ ప్రెగ్నెన్సీ సమయంలో తాను ఎలాంటి విషయాలు ఫాలో అవుతున్నారు అనేది చెప్పారు.
https://www.instagram.com/p/CZvlp7vhx3x/?utm_source=ig_web_copy_link
End of Article