గత సంవత్సరం ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ పెళ్లి బిజినెస్ మెన్ అయిన గౌతమ్ కిచ్లు తో జరిగింది. వివాహంలో కేవలం రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఎటువంటి హంగామా లేకుండా సింపుల్ గా వారిద్దరి వివాహం జరిగింది. తర్వాత నుండి కాజల్ షూటింగ్స్ లో పాల్గొంటూనే ఉన్నారు.

kagal aggarwal

ప్రస్తుతం కాజల్ తెలుగులో ఆచార్య తో పాటు, ఒక హిందీ సినిమా, అలాగే ఒక తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా కాజల్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాజల్ తల్లి కాబోతున్నారు అనే వార్త ఒకటి ఈ రోజు ట్విట్టర్ లో సడన్ గా ప్రత్యక్షం అయ్యింది. కాజల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కాని గత కొద్ది రోజుల నుండి మాత్రం ఎక్కువగా పోస్ట్ చేయట్లేదు. దాంతో ఫ్యాన్స్ అందరూ ఇది నిజమా లేక పుకారా అని కామెంట్స్ చేస్తున్నారు.