Ads
తన నటన,అందంతో దాదాపు టాలీవుడ్ ను దశాబ్దం పాటు ఎకచక్రాదిపత్యంగా ఏలిన కాజల్ కు ఇప్పుడు కుర్ర హీరోయిన్స్ నుండి పోటీ ఎక్కువవడంతో సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి.అవి ఎంతలా అంటే ఆమె గ్రాఫ్ హీరోయిన్ నుండి సహాయక పాత్రలు చేసేంతగా పడిపోయింది.ప్రస్తుతం కాజల్ మంచు విష్ణుకు చెల్లెలిగా ఓ చిత్రంలో అలాగే ఆచార్య చిత్రంలో నటిస్తుంది.
Video Advertisement
వరుస ఫ్లాప్ లు మూటగట్టుకోవడం రెమ్యూనరేషన్ తగ్గించకపోవడంతో దర్శకనిర్మాతలు ఆమెను అప్రోచ్ అవ్వడం తగ్గించారట.అందుకే తన చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయని సినీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది.ఇక కంగనా హిందీలో చేసిన క్వీన్ సినిమాను సౌత్ లాంగ్వేజెస్ లో ఒకో బాషకు ఒకరు హీరోయిన్ గా నటిస్తున్నారు.
తమిళ్ లో ఈ చిత్రం పేరు ప్యారిస్ ప్యారిస్ ఇందులో కాజల్ మెయిన్ లీడ్ గా నటిస్తుంది.ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడో రిలీజ్ అయ్యింది.చిత్రంలో మిగతా భాషలలో కంటే ఒరిజినల్ కంటే బోల్డ్ కంటెంట్ బోలెడు ఉండడంతో సెన్సార్ వద్ద సమస్యలను ఎదుర్కొంది. ఈ చిత్రం పై అప్పట్లో బూతు సినిమా అంటూ జరిగిన ప్రచారాన్ని చిత్ర టీం ఖండిచకపోవడంతో చిత్రం పై బూతు ముద్ర పడింది.
బోలెడు కష్టాలు ఎదుర్కొన్న ఈ చిత్రానికి థియేటర్ రిలీజ్ సాధ్యం కావట్లేదు అందుకే చిత్రం ఈ చిత్రాన్ని ఓ.టి.టి ప్లాట్ ఫార్మ్స్ పై రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.అందుకు సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ప్రస్తుతం సోషల్ మీడియాలో కొత్త చర్చ జరగుతుంది.ఇందులో నిజమెంత తెలియాల్సి వుంది.
End of Article