Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్‌లో మహేష్ బాబు చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమా మొదటి పాట ఫిబ్రవరి 14న విడుదల అవ్వబోతోంది.
Video Advertisement
ఈ సినిమాకి సోలో, గీతగోవిందం సినిమాలకు దర్శకత్వం వహించిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్‌లో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్‌తో పాటు, వెన్నెల కిషోర్ కూడా కనిపించారు.
అయితే సర్కారు వారి పాట సినిమాలో సినిమాలో మొదటి పాట అయిన “కళావతి” ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో మహేష్ బాబు, కీర్తి సురేష్ కనిపిస్తున్నారు. ఈ పాటని ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు. కళావతి పాటకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకి సంబంధించిన ఒక ఎడిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన కింగ్ సినిమాలో బ్రహ్మానందం గారికి, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారికి మధ్య ఒక సీన్ ఉంటుంది.
అందులో రామజోగయ్య శాస్త్రిగారు ఒక పాట పాడి వినిపిస్తే, బ్రహ్మానందం గారు ఆ పాట నచ్చలేదు అని, వేరే పాట ఒకటి పాడమని చెప్పి ఆ పాటకి తన లిరిక్ యాడ్ చేస్తారు. ఇదే సీన్‌కి సర్కారు వారి పాట సినిమాలో కళావతి పాటని యాడ్ చేసి, తర్వాత బ్రహ్మానందం గారు పాడే పాటకి కళావతి పాట రీమిక్స్ వెర్షన్ పెట్టి ఎడిట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
Class ni mass cheysesaru ga 😇😇😅😅👌👌#SarkaaruVaariPaata pic.twitter.com/i7n6eWVDVP
— vin∆y t£ja 🎃 (@itsme_Vteja) February 27, 2022
End of Article