శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో అద్భుత దృశ్యం…కాలభైరవ స్వామి ఉత్సవం విజయస్తంభము వద్దకు రాగానే.?

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో అద్భుత దృశ్యం…కాలభైరవ స్వామి ఉత్సవం విజయస్తంభము వద్దకు రాగానే.?

by Megha Varna

Ads

శ్రీకాళహస్తి ఆలయం ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆలయం. నిత్యం ఎంతో మంది భక్తులు శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో ఒక వింత జరిగింది. ఈ వింత కాలభైరవుని పూజలు చేస్తున్న సమయంలో జరిగింది అయితే ఇంతకీ శ్రీకాళహస్తి ఆలయంలో జరిగిన వింత ఏమిటంటే..

Video Advertisement

కాలభైరవుని పూజలు తరవాత స్వామి వారిని బయటికి తీసుకుని వచ్చారు. కంచి గడప దగ్గర మేళ తాళా దగ్గర వున్నప్పుడు ఆకాశ నంది ధ్వజ స్తంభానికి వుండే నాలుగు గొలుసులతో ఒక గొలుసు మేళ తాళాలు మ్రోగించే దాకా నృత్యం చేస్తున్నట్టుగా తిరిగింది.

శ్రీకాళహస్తిశ్వర క్షేత్రం లో క్షేత్రపాలకుడైన కాల భైరవుడి ఉత్సవంలో ఇది చోటు చేసుకుంది. ఇది చూసి భక్తులు షాక్ అయ్యిపోయారు. పైగా ఇది చూసిన వారంతా కూడా ఇదంతా భగవంతుడి మహిమ అని అంటున్నారు. పైగా దీనితో చాలా మంది భక్తులు మంత్ర ముగ్దులయ్యారు. చాలా విడ్డూరంగా వుంది కదా ధ్వజ స్తంభానికి వుండే నాలుగు గొలుసుల్లో కేవలం ఒక్క గొలుసు మాత్రమే కదిలింది. పైగా మిగిన మూడు గొలుసులు కూడా ఏ మాత్రం కదల్లేదు.

మాములుగా ఒకటి కదిలింది అంటే మిగిలినవి కూడా కదలాలి కదా కానీ అలా ఇక్కడ జరగలేదు. నాలుగు గొలుసులు ధ్వజ స్తంభానికి ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే కదిలింది. గాలికి గొలుసు కదిలింది అనుకోవడానికి కూడా లేక పోయింది. ఎందుకంటే నాలుగు గొలుసుల్లో కేవలం ఒక్క గొలుసు మాత్రమే ఊగడం జరిగింది.

పైగా మిగిన మూడు గొలుసులు కూడా ఏ మాత్రం కదల్లేదు. ఒక్కటి మాత్రమే నృత్యం చేస్తున్నట్టుగా కదిలింది. పైగా ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయి. నిజంగా ఇది భగవంతుడి లీలే అని అంతా భావించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మరి ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.

watch video:

 


End of Article

You may also like