కల్కి 2898 ఏ.డీ సెన్సార్ టాక్..! సినిమా చూసి ఏం అన్నారంటే..?

కల్కి 2898 ఏ.డీ సెన్సార్ టాక్..! సినిమా చూసి ఏం అన్నారంటే..?

by Mohana Priya

Ads

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కల్కి 2898 ఏ.డీ. ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. సినిమా బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టారు. సినిమా బృందం చాలా ఆలస్యంగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు అంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. కానీ సినిమా బృందం మాత్రం ప్రమోషన్స్ మీద ప్లాన్ తో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే, సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాని సెన్సార్ బృందం వాళ్ళు చూసి, పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చినట్టు సమాచారం.

Video Advertisement

difference in kalki 2898 ad teaser and trailer.

సినిమా చాలా బాగుంది అని, ఒక రాజమౌళి లాగా ఒక నాగ్ అశ్విన్ అని అన్నారట. మహానటి కంటే ఈ సినిమా విషయంలో నాగ్ అశ్విన్ ఇంకా జాగ్రత్తలు తీసుకున్నారట. టేకింగ్ పరంగా కూడా మహానటి కంటే ఈ సినిమా చాలా ముందు ఉందట. ప్రభాస్ ఫైటింగ్ సీన్స్ లో చాలా బాగా చేసినట్టు సెన్సార్ బృందం తెలిపారు అనే వార్త కూడా వచ్చింది. ఈ వయసులో కూడా అమితాబ్ బచ్చన్ సినిమా కోసం తన వంద శాతం ఇచ్చారు అని మెచ్చుకున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే.

సినిమా బృందం ఇవాళ ముంబైలో ఒక ఈవెంట్ నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్ కోసం ప్రభాస్ ఇప్పటికే ముంబై చేరుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులతో పాటు, సినిమాలో నటించిన వాళ్లందరూ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటారు. అంతే కాకుండా సినిమా టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా ఈవెంట్ లో పాల్గొంటారు. ఈ సినిమా కోసం చేస్తున్న ఒకే ఒక్క ఈవెంట్ ఇదే అని సమాచారం. ఇంక వేరే ఈవెంట్స్ ఉండవు అని అంటున్నారు. అన్ని భాషల మీడియాతో ఇదే ఈవెంట్ లో మాట్లాడుతారు అనే వార్త కూడా వచ్చింది. అంతే కాకుండా కొన్ని ఇంటర్వ్యూలు కూడా సినిమా బృందం విడుదల చేస్తారు.


End of Article

You may also like