Home Filmy Adda ఇలాంటి కొడుకు ఎందుకు లేడు అని ఎమోషనల్ అయిన కల్పలత..!!

ఇలాంటి కొడుకు ఎందుకు లేడు అని ఎమోషనల్ అయిన కల్పలత..!!

by Megha Varna

అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. క్లాస్, మాస్, ఫ్యామిలీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా నటనతో అలరించారు అల్లు అర్జున్. దక్షిణ, ఉత్తర భారత సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన పుష్ప సినిమా ప్రేక్షకుల్ని బాగా అలరిస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సంబరాలు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లిగా కల్పలత నటించారు. ఆమె అల్లు అర్జున్ గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.

బన్నీ షూటింగ్ సమయంలో ఎక్కువగా తన పాత్ర గురించి ఆలోచిస్తారని ఆమె అన్నారు. పర్సనల్ విషయాలన్నీ పక్కన పెట్టి పాత్రలో నిమగ్నం అయిపోతారు అని అన్నారు ఆమె. అలానే ఆమెకి కొడుకులు లేరు అని.. కేవలం ఇద్దరు ఆడపిల్లలు మాత్రమేనని చెప్పారు.

అల్లు అర్జున్ ని చూశాక తన లాంటి కొడుకు లేరు అని బాధ పడ్డారని కల్పలత చెప్పారు. బన్నీ సపోర్ట్ గా చేయి పట్టుకుని కళ్ళతోనే నేనున్నానంటూ భరోసా ఇచ్చే వారని చెప్పారు. తన లాంటి కొడుకు ఉంటే బాగుంటుందని బన్నీతో చెప్తే దగ్గరకు తీసుకుని ఓదార్చారు అని ఆమె అన్నారు.

You may also like