Home Filmy Adda ఆ మెగా సెలబ్రేషన్స్‌లో “కళ్యాణ్ దేవ్” మాయం..! కారణమేంటి..?

ఆ మెగా సెలబ్రేషన్స్‌లో “కళ్యాణ్ దేవ్” మాయం..! కారణమేంటి..?

by Mohana Priya

మెగా డాటర్ శ్రీజకి సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తుంది. దానికి కారణం ఆమె ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో భర్త పేరును తొలగించడమే. ఇప్పటివరకు శ్రీజ కళ్యాణ్ అని ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో పేరు పెట్టుకున్న ఆమె..ఇప్పుడు శ్రీజగా మార్చుకున్నారు. నిజానికి పెళ్లి తర్వాత శ్రీజ కళ్యాణ్ గా ప్రొఫైల్ పేరు మార్చుకున్నారు.

కానీ ఇప్పుడు భర్త కళ్యాణ్ పేరు తొలగించడానికి గల కారణాలు ఏంటా అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నెలకొంది. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన “సూపర్ మచ్చి” చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.

kalyaan dhev is not seen in mega family sankranti celebrations

సాధారణంగా ఏదైనా మెగా హీరో సినిమా అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరో ఒకళ్ళు ఆ సినిమాని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతే కాకుండా, అంతకుముందు కళ్యాణ్ దేవ్ నటించిన సినిమాలని కూడా ప్రమోట్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మెగా అల్లుడు సినిమా విడుదల ఉంటే ఒక్కళ్ళు కూడా ప్రమోట్ చేయలేదు. దాంతో అనుమానాలు ఇంకా పెరిగాయి.

kalyaan dhev is not seen in mega family sankranti celebrations

 

కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి సినిమా సంక్రాంతి కానుకగా ఇటీవల విడుదల అయ్యింది. కానీ సినిమాకి సంబంధించి ఎవరు ఎక్కువగా ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. ప్రస్తుతం అయితే ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది. ఇది మాత్రమే కాకుండా ఇటీవల మెగా ఫ్యామిలీలో జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్ లో కూడా కళ్యాణ్ కనిపించలేదు. దాంతో అనుమానాలు మరింత పెరిగాయి. ఈ విషయంపై, శ్రీజ కానీ, కళ్యాణ్ కానీ, ఆ ఫ్యామిలీకి సంబంధించిన వారు కానీ స్పందించేంత వరకు ఆగాల్సిందే.

You may also like