Amigos Review : “కళ్యాణ్ రామ్” నటించిన అమిగోస్ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Amigos Review : “కళ్యాణ్ రామ్” నటించిన అమిగోస్ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : అమిగోస్
  • నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ.
  • నిర్మాత : నవీన్ యెర్నేని, వై రవిశంకర్
  • దర్శకత్వం : రాజేంద్ర రెడ్డి
  • సంగీతం : జిబ్రాన్
  • విడుదల తేదీ : ఫిబ్రవరి 10, 2023

amigos censor review

Video Advertisement

స్టోరీ :

సిద్ధు (కళ్యాణ్ రామ్) హైదరాబాద్ లో తన కుటుంబంతో కలిసి ఉంటాడు. తనలాగే కనిపించే వ్యక్తులని కలిపే ఒక వెబ్‌సైట్‌ గురించి సిద్ధు తెలుసుకుంటాడు. అందులో బెంగళూరులో ఉండే మంజు, అలాగే కోల్‌కతాలో ఉండే మైఖేల్ తో సిద్ధుకి పరిచయం ఏర్పడుతుంది. వారు ముగ్గురు కలిసి కొంత సమయం గడుపుతారు. కానీ ఆ తర్వాత వారిలో ఒకరు మంచివారు కాదు అని తెలుస్తుంది. దాని వల్ల మిగిలిన ఇద్దరూ కూడా ప్రమాదంలో పడతారు. అసలు సిద్ధు కలిసిన మిగిలిన ఇద్దరు ఎవరు? వారి కథ ఏంటి? ఆ ఒక్క వ్యక్తి వల్ల మిగిలిన ఇద్దరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఆ ఇబ్బందుల నుండి ఎలా బయటపడ్డారు? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

amigos censor review

రివ్యూ :

ఒక హీరో డబుల్ యాక్షన్ చేయడం అంటేనే చాలా కష్టమైన పని. కానీ ఒక హీరో మూడు పాత్రలు పోషించడం అంటే ఇంకా కష్టమైన పని. ఇలాంటి పాత్రలు పోషించిన హీరోలు అంతకుముందు చాలామంది ఉన్నారు. వారందరికీ చాలా గుర్తింపు లభించింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా మూడు పాత్రలు తానే పోషించారు. పాత్రకి పాత్రకి ఉన్న తేడా చూపించడానికి కళ్యాణ్ రామ్ చాలా కష్టపడ్డారు.

amigos censor review

సినిమా కథ డిఫరెంట్ గా ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ చేయడం అనేది కళ్యాణ్ రామ్ ని అభినందించాల్సిన విషయం. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని కళ్యాణ్ రామ్ నడిపించారు. మూడు పాత్రల్లో బాగా నటించారు. హీరోయిన్ ఆషిక తన పాత్ర పరిధి మేరకు నటించారు. బ్రహ్మాజీ, సప్తగిరి కూడా తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకి వాడిన టోన్ వల్ల ఒక యాక్షన్ సినిమా చూస్తున్నాం అనే ఫీల్ వస్తుంది.

amigos censor review

జిబ్రాన్ అందించిన పాటలు బాగున్నాయి. అందులోనూ ముఖ్యంగా ఎన్నో రాత్రులొస్తాయి గానీ పాటలు చిత్రీకరించిన విధానం బాగుంది. కానీ కథ అంత బాగున్నా కూడా తెరకెక్కిన విధానంలో చాలా లోపాలు కనిపిస్తూ ఉంటాయి. స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉంటుంది. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి కావాల్సింది సినిమా ఫాస్ట్ గా నడవడం. కానీ ఈ సినిమా విషయంలో అలా లేదు. దాంతో కథ బాగున్నా కూడా చూపించే విధానంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • కళ్యాణ్ రామ్
  • యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • స్క్రీన్ ప్లే
  • ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్

రేటింగ్ :

2.25/5

ట్యాగ్ లైన్ :

కథ గురించి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, కళ్యాణ్ రామ్ కోసం చూద్దాం అనుకునే వారికి, యాక్షన్ సినిమాలని ఇష్టపడే వారికి అమిగోస్ ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

watch trailer :


End of Article

You may also like