షేర్‌షా సినిమాపై ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మేజర్ విక్రమ్ బాత్రా జీవిత ఆధారంగా తీసారు. ఈ సినిమాకి పంజాబ్ సినిమా దర్శకత్వం వహించిన విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకి ఎంతో మంది ప్రముఖులు నుండి ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు స్టార్ హీరో కమల్ హాసన్ గారు కూడా ఈ సినిమాని అభినందించారు. తన సోషల్ మీడియాలో కమల్ హాసన్ గారు ఈ విధంగా రాశారు.

 

“చిన్నప్పటి నుంచి ఒక సినిమా అభిమానిగా అలాగే ఒక దేశభక్తుడి కొడుకుగా సినిమాల్లో ఇండియన్ ఆర్మీ గురించి చూపించినా విధానం నాకు కోపం తెప్పించింది. కానీ ఈ సినిమా మాత్రం అందుకు మినహాయింపు. ఈ సినిమా చూస్తే నాకు చాలా గర్వంగా అనిపించింది. విష్ణువర్ధన్ లాంటి ప్రతిభ ఉన్న దర్శకులను నమోదు చేసినందుకు ధర్మ ప్రొడక్షన్స్ కి ధన్యవాదాలు. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా కి కియారా అద్వాని కి కంగ్రాచ్యులేషన్స్” అని రాశారు.