పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్ డానిష్ కనేరియా,షాహిద్ అఫ్రిది మధ్య జరుగుతున్న వివాదంలో మరో కొత్త అంశం చర్చకు వచ్చింది. తాను టీమ్ నెంబర్ గా ఉన్న సమయంలో ఆఫ్రిది వల్ల పడ్డ ఇబ్బందుల గురించి మరొకసారి కనేరియా పలు రకాల టీవీ చానల్స్ కు ఇంటర్వ్యూల రూపంలో తెలియజేస్తున్నారు. అందులో భాగంగా వెలుగు చూసిన అంశం తన సొంత కూతురి తో ఆఫ్రిది దారుణంగా ప్రవర్తించిన ఇన్సిడెంట్.

Video Advertisement

తన కూతురు ఒక హిందూ దేవుడిని పూజ చేస్తుంది అన్న కోపంతో ఆఫ్రిది ఒకసారి టీవీ ని పగలగొట్టాడట. సొంత కూతురు తోటే అంత క్రూరంగా ప్రవర్తించిన మనిషి నాతో ఎలా ప్రవర్తించి ఉంటాడో అర్థం చేసుకోండి అని కనేరియా తన ట్విట్టర్లో ఒక పోస్టు ద్వారా వెల్లడించాడు. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. సమాధానంగా ఆఫ్రిది తాను ఒకరోజు ఇంటికి వచ్చే సమయానికి ఏదో టీవీ సీరియల్ చూస్తూ ఆటలో భాగంగా తన కూతురు అలా చేసిందని. తన బిడ్డ హిందూ సంప్రదాయాన్ని పాటించడం నచ్చక టీవీని మోచేతితో కొట్టి పగలగొట్టాను అని అన్నారు. ఆఫ్రిది ఇచ్చిన సమాధానం విన్న హోస్ట్ తో సహా అక్కడ ఉన్న పాకిస్తాన్ ప్రేక్షకులు కూడా చప్పట్లతో తమ ఆమోదం తెలిపారు.

పాకిస్తాన్ టీం తరఫున ఆడిన ఫస్ట్ ఇండియన్ అనిల్ దళపతి అయితే రెండవ వ్యక్తి డానిష్ కనేరియా. కనేరియా తన క్రికెట్ కెరియర్లో పార్క్ తరఫున 61 టెస్టులు, 18 వన్డేలు ఆడడంతోపాటు 20076 వికెట్లు పడగొట్టాడు. అయితే అనూహ్యంగా 2012లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న కమీడియా క్రికెట్ కెరియర్ కు పుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది.