సుశాంత్ ను వారే హత్య చేసారు….కంగనా సంచలన వ్యాఖ్యలు..!

సుశాంత్ ను వారే హత్య చేసారు….కంగనా సంచలన వ్యాఖ్యలు..!

by Megha Varna

Ads

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను బాలీవుడ్ పెద్దలే హత్య చేశారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది నటి కంగనా రనౌత్… బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం ఉందని.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చేవాళ్లని ఎదగనివ్వరని మండిపడింది..సుశాంత్ ఆత్మహత్య నేపద్యంలో కంగనా రనౌత్ మాటలు బాలివుడ్లో పెద్ద చర్చకే దారితీశాయి.. సుమారు రెండు నిమిషాల నిడివిగల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కంగనా..

Video Advertisement

సుశాంత్ చాలా అద్భుతమైన నటుడు. “కై పో చె”  సినిమాకు బెస్ట్ డెబ్యూ అవార్డు రావాలి కానీ అవార్డు రానివ్వకుండా చేశారు. MS ధోనీ, కేధారనథ్, చిచోరే  ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసాడు. ఎంతో టాలెంట్ ఉన్న నటుడు సుశాంత్, ‘చిచ్చోరే’ వంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీని వదిలేసి. గల్లీబాయ్ సినిమాకు అవార్డ్ ఇస్తారు. సుశాంత్ ఏం కోరుకోలేదు..కొంచెం గుర్తింపు కోరుకున్నాడు..అటువంటి గుర్తింపు ఎందుకు ఇవ్వరు..

స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి స్కాలర్ షిప్ సంపాదించిన వ్యక్తి మానసికంగా ఎలా బలహీనంగా ఉంటాడు.? అంటూ ప్రశ్నించింది కంగనా..సుశాంత్ పోస్టులను గమనిస్తే  తన సినిమాలను చూడమని అభిమానులను వేడుకున్నాడు. తనకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరని.. సినిమాలు ఆడకపోతే తనను ఇండస్ట్రీ బయటికి పంపిస్తారని బాధపడ్డాడు.. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేవారిని ప్రోత్సహించరు ,ఇంకా వెనక్కి లాగుతారు..బ్యాడ్ రివ్యూస్ రాయించి కెరీర్ నాశనం చేస్తారు అని మండిపడింది కంగనా. నాపైనా కూడా ఆరు కేసులు బనాయించారు. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ పెద్దలు పెట్టిన స్ట్రెస్ ఏ కారణమని ఆరోపించింది.

కంగనా వీడియో బాలివుడ్ లో పెద్ద చర్చకు దారి తీసింది…సోషల్ మీడియాలో వైరలయిన వీడియోతో నెటిజన్లు కంగనాని ప్రశంసిస్తూ బాలివుడ్ పై దుమ్మెత్తి పోస్తున్నారు..ఇక్కడ వారసులకే చోటుంటుంది..సుశాంత్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ లను గుర్తించరు అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు..


End of Article

You may also like