Home Filmy Adda మహేష్ బాబు చెప్పింది నిజమే అంటూ “కంగనా రనౌత్” సంచలన కామెంట్స్.!

మహేష్ బాబు చెప్పింది నిజమే అంటూ “కంగనా రనౌత్” సంచలన కామెంట్స్.!

by Sunku Sravan

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ఎన్నో సినిమాలలో తనదైన శైలిలో నటించి సూపర్ స్టార్ గా పేరు పొందారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ నటులలో ఈయన కూడా ఒకరు. ఈమధ్య మహేష్ బాబు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీ తనని భరించలేదు అంటూ ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై నటి కంగనా రనౌత్ స్పందించారు. మహేష్ బాబు మాటల్లో వాస్తవమే ఉన్నదని అన్నారు. ఆమె నటించిన “ధడక్” మే 20 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగంగా ముంబైలో కంగనా ఈ విషయాన్ని చెప్పింది. ప్రతి ఒక్క ఈ విషయాన్ని వివాదాస్పదంగా చూడవలసిన అవసరం లేదని.. మహేష్ బాబు మాటల్ని క్లియర్ గా అర్థం చేసుకోవాలని అన్నారు.. సూపర్ స్టార్ మహేష్ మాటల్లో వాస్తవమే ఉన్నదని, బాలీవుడ్ ఇండస్ట్రీ నిజంగానే ఆయనను భరించలేదు అని ఆమె అన్నారు.. ఎందుకంటే ఆయనకు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ నుండి అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆయన తరం నటీనటులు అందరూ కలిసి టాలీవుడ్ ని దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీ గా తీర్చిదిద్దారు.. అలాంటి మహేష్ బాబు తన సొంత ఇండస్ట్రీపై చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయి.. దాన్ని ఎవరు కూడా కాదనలేరు.. తెలుగు ఇండస్ట్రీ పై మరి అభిమానులపై ఆయనకున్న ప్రేమ వల్లనే అలా చెప్పి ఉంటాడు. కాబట్టి ఎవరైనా సరే ప్రతి విషయాన్ని వివాదాస్పదంగా చూడవలసిన అవసరం లేదనీ ఆమె అన్నారు. తెలుగు ఇండస్ట్రీ ఇండియా లెవెలులో ఎదగడానికి అందరూ చాలా కష్టపడుతున్నారు అని దీన్ని తప్పకుండా ఒప్పుకోవాలని కంగనా అన్నారు. దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల నుంచి వాళ్లు చాలా కష్టపడి ఇండస్ట్రీ టాప్ ప్లేస్లో నిలబెట్టారని, వాళ్లని చూసి నేర్చుకోవాలని కంగనా సూచించారు.

 

You may also like