Ads
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇన్నిరోజులు స్టార్లుగా తిరిగిన హీరోలను దర్శకులను సినీ అభిమానుల చేత ట్రోలింగ్ చేయిస్తుంది.నెపోటిజం పై పెద్ద ఎత్తున చర్చకు తెర లేపింది.
Video Advertisement
సుశాంత్ సింగ్ కు న్యాయం జరగాలంటూ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.అలాగే సుశాంత్ సూసైడ్ వెనుక దాగివున్న ఆసక్తికర అంశాలను రోజుకొకటి ఈమె బయటపెడుతున్నారు.అంతేకాకుండా సుశాంత్ ను డీ ఫేమ్ చేసేలా కామెంట్ చేస్తున్న వారికి ప్రశ్నలు సంధిస్తున్నారు.
తాజాగా కంగనా మరోమారు ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు.ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో కంగనా రనౌత్
“అందరికీ అతనెవరో తెలుసు కాని ఎవ్వరూ అతని పేరు కూడా పలకరు, దర్శకుడు కరణ్ జోహార్ కు ఆప్త మిత్రుడు మరియు ప్రపంచ ప్రఖ్యాత ముఖ్యమంత్రి కుమారుడు,ముద్దుగా బేబీ పెంగ్విన్ అని పిలుస్తారు.కంగనా అనే నేను చెబుతున్నాను రేపు నేను ఇంట్లో తాడుకు వేలాడుతూ కనిపిస్తే దయచేసి తెలుసుకోండి నేను సూసైడ్ చేసుకోలేదని అంటూ కంగనా తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇప్పుడు కంగనా చేసిన ట్వీట్ లో ఆ బేబీ పెంగ్విన్ అదేనండి ఆ ముఖ్యమంత్రి కుమారుడు ఎవరని సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. సుశాంత్ సూసైడ్ కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బోలెడు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. అందుకే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సిబిఐకిఅప్పజెప్పాలని సినీ అభిమానులు కోరుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ప్రజల కోరికను మన్నించి ఈ కేసును సీబీఐకి అప్ప చెబుతుందో లేదో వేచి చూడాలి.
End of Article