Ads
విదేశాల నుండి వచ్చి విదిగా వైధ్యపరీక్షలకు హాజరు కావాలని చెప్తున్నప్పటికి , ఆ మాటలను పెడచెవిన పెట్టి బర్త్ డే ఫంక్షన్ కి హాజరు కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే . లండన్ నుండి నేరుగా లక్నో కి చేరుకుని అక్కడ మాజీ సిఎం వసుందర రాజే కొడుకు ఇంట్లో బర్త్ డే ఫంక్షన్ కి హాజరయింది. ఆ ఫంక్షన్ కి సుమారు 400 మంది హాజరయ్యారు దీంతో కనికా ఆ 400 మందిని ప్రమాదంలో నెట్టేసింది. ఈ విషయంపై లక్నో పోలీసులు కనికాపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కనికని సంజయ్ గాంది పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్ట్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు.
Video Advertisement
వివరాలలోకి వెళ్తే…కరోనా నేపథ్యంలో కనికా బాధ్యతారహితంగా వ్యవహరించారని లక్నో మెడికల్ ఆఫీసర్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు చేపట్టారు. విచారణకు హాజరుకావాలంటూ ఆమెకు నోటీసులు పంపారు. లక్నోలోని సంజయ్ గాంధీ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదుతో కనికాకపూర్‌పై ఐపీసీ సెక్షన్ 269, 270, కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆమెకు లక్నో కృష్ణా నగర్ ఏసీపీ దీపక్ కుమార్ సింగ్ విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. విచారణ అనంతరం వెల్లడైన విషయాలను బట్టి ఆమెపై చర్యలు తీసుకుంటాము అని తెలిపారు.
ఇది ఇలా ఉండగా…దానికి ముందు రోజే కనికా ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. క్వారంటైన్‌లో ఉండగా నాపై వచ్చిన కథలు, వార్తలు, రూమర్లపై నేను రియాక్ట్ అవ్వాలి అనుకోవట్లేదు. ఎందుకంటే నావైపు కొంత తప్పు జరిగింది కనుక నేను ఏమీ మాట్లాడటం లేదు. అయితే ఆ విషయంలో చాలా తప్పుడు తప్పుడు ప్రచారం జరిగింది. వీటన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. ఏదో ఒకరోజు తప్పుకుండా అసలు విషయం బయటకు వస్తుంది. ఇలాంటి రూమర్స్ సృష్టించిన వారు తప్పకుండ పశ్చాత్తాప పడుతారు అంటూ కనికా కపూర్ పోస్ట్ చేసారు.
End of Article