సింగర్ కనికాకు ఆరోసారి నెగటివ్…కానీ అసలు ప్రమాదం ముందుంది.! అదేంటంటే?

సింగర్ కనికాకు ఆరోసారి నెగటివ్…కానీ అసలు ప్రమాదం ముందుంది.! అదేంటంటే?

by Sainath Gopi

Ads

గత పదిహేను రోజులుగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న కనికకి వరుసగా ఐదో సారి చేసిన పరీక్షల్లో కూడా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో ఏప్రిల్ 3, 4 తేదీలలో నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది. అయితే ఆమెని ఇప్పుడే డిశ్చార్జ్ చేయరు అంట. ప్రస్తుత పరిస్థితుల్లో లక్నోలోని పీజీఐ హాస్పిటల్‌లోనే ఉండాలి. మరికొన్ని పరీక్షలు నిర్వహించి అవి కూడా నెగటివ్ వస్తే డిశ్చార్జ్ గురించి ఆలోచిస్తామని సంజయ్ గాంధీ పీజీఐఎమ్ఎస్ వైద్యులు తెలిపారు.

Video Advertisement

విదేశాల నుండి వచ్చి విదిగా వైధ్యపరీక్షలకు హాజరు కావాలని చెప్తున్నప్పటికి , ఆ మాటలను పెడచెవిన పెట్టి బర్త్ డే ఫంక్షన్ కి హాజరు కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే . లండన్ నుండి నేరుగా లక్నో కి చేరుకుని అక్కడ మాజీ సిఎం వసుందర రాజే కొడుకు ఇంట్లో బర్త్ డే ఫంక్షన్ కి హాజరయింది. ఆ ఫంక్షన్ కి సుమారు 400 మంది హాజరయ్యారు . తనతో పాటు ఇప్పుడు ఆ 400మందిని, వారు నేరుగా కాంటాక్ట్ అయిన మరెంతో మందిని ప్రమాదంలో నెట్టేసింది.  ఈ విషయంపై లక్నో పోలీసులు కనికాపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కనికని నిర్బందించి సంజయ్ గాంది పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్ట్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు.

కనికా పై 188, 269, 270 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం గమనార్హం.ఈ క్రమంలో ఆమె హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినా ఆమెను అరెస్ట్ చేసి విచారించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉండగా కనిక కపూర్ తన ఇన్స్టా అకౌంట్లో ఒక కోట్ పోస్టు చేస్తూ,దానికి తన వ్యాఖ్యలను జోడించింది.అవేంటంటే “లైఫ్ టీచెస్ టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ టైమ్, వైల్ టైమ్ టీచెస్ అజ్ ది వాల్యూ ఆఫ్ లైఫ్” జీవితము కాలం విలువను తెలియచెప్తుంటే,  కాలం మన జీవితం విలువని తెలియచేస్తుంది అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టింది. అందరూ జాగ్రత్తగా ఉండండి,నేను బాగున్నాను, నా పిల్లల్ని , ఫ్యామిలిని మిస్ అవుతున్నాను, వాళ్లని త్వరలోనే చూడాలని కోరుకుంటున్నాను అంటూ , నేను ఐసియు లో లేను అంటూ వ్యాఖ్యానించింది.

కనికా కపూర్ చేసిన ఈ ఎమోషనల్ పోస్టుని కొద్దిసేపటి తర్వాత డిలీట్ చేసింది. అయితే తనకి జీవితం విలువ తెలిసింది, ఐసియూలో లేను అంటూ ధైర్యంగా పోస్టు చేసిన కనికా, ఫోర్త్ టైం కూడా నెగటివ్ రావడంతో ఏమైనా కృంగిపోయుంటుందా? అందుకే ఆ పోస్టు డిలీట్ చేసిందా? ఏదేమైనా  నిబంధనలు పాటించకుండా కనిక చేసిన పనికి యావత్ దేశం అంతా కోపోద్రిక్తులైనప్పటికి, తన ఫ్యామిలిని, పిల్లల్ని చూడాలనుకుంటున్నా అని కనిక చేసిన పోస్టు కి ఎమోషనల్ అయ్యారు . తన ఆరోగ్యం మెరుగు పడుతుందో లేదో అనేది ఇంకా తెలియాల్సి ఉంది.


End of Article

You may also like