కరోనా అనుమానంతో కన్నతల్లిని ఇంటినుండి గెంటేసిన కొడుకులు.! దిక్కులేక ఎండలో నడిరోడ్డుపై ఆమె!

కరోనా అనుమానంతో కన్నతల్లిని ఇంటినుండి గెంటేసిన కొడుకులు.! దిక్కులేక ఎండలో నడిరోడ్డుపై ఆమె!

by Megha Varna

Ads

మనుషులకు  హ్యాండ్ శానిటైజర్లతో పాటు, మెదడులో ఉన్న చెత్తని క్లియర్ చేసే బ్రెయిన్ శానిటైజర్లు కూడా కావాలి అని ఎక్కడో చదివా..ఈ వార్త చూస్తే బ్రెయిన్ శానిటైజర్ల అవసరం చాలా ఉంది అనిపిస్తుంది..కరోనా వచ్చిందో లేదో తెలియదు..వచ్చినా కూడా వైద్య సదుపాయాలు అందుబాటులోనే ఉన్నాయి..అవన్నింటిని పక్కన పెట్టి కరోనా ఉందంటూ కన్నతల్లిని ఇంట్లోకి రానివ్వని ఘటన అందరిని విస్తుపోయేలా చేస్తోంది..

Video Advertisement

కరీంనగర్ జిల్లాకు చెందిన శ్యామల అనే 70ఏళ్ల మహిళ, రెండు నెలల క్రితం మహారాష్ట్రలోని షోలాపూర్లో బంధువుల ఇంటికి ఫంక్షన్ కి వెళ్లింది.. ఫంక్షన్ అయిపోయాక తిరిగి వచ్చేద్దామనుకునేసరికి లాక్ డౌన్ ప్రకటించారు..చేసేదేం లేక రెండు నెలల పాటు బంధువుల ఇంట్లోనే ఉండిపోయింది..ఇటీవల లాక్ డౌన్ సడలింపు ఇచ్చేసరికి వెంటనే పయనమైంది.మహారాష్ట్ర నుండి హైదరాబాద్ కి అక్కడి నుండి బస్ లో కరీంనగర్ కి వెళ్లింది.అక్కడ నుండి కిసాన్ నగర్ ప్రాంతంలో కొడుకుల ఇంటికి వెళ్లింది..

ఇన్ని రోజులకు తనను చూసిన కొడుకులు సంతోషపడతారు.. అష్టకష్టాలు పడి వచ్చిన తన కష్టాన్ని గుర్తిస్తారనుకున్న తల్లి ఆశలు అడియాశలయ్యాయి.. నీకు కరోనా ఉంది ఇంట్లోకి రాకు అంటూ కొడుకులు తలుపులు పెట్టేసారు.. కొడుకులు అంటే అలా చేశారు.. ఇద్దరు కోడళ్లది ఇదే వరస.. మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా ఉన్నాయి నీకు కూడా కరోనా వచ్చుంటుంది..ఇక్కడ నుండి వెళ్లిపో అని రోడ్డుపైకి గెంటేశారు.ఏం చేయాలో పాలుపోక ఇంటి ముందే రోడ్డుపై కూలబడిపోయింది శ్యామల..ఒక వైపు ప్రయాణం చేసొచ్చిన అలసట, మరోవైపు మండుటెండ..చేసేదేంలేక అక్కడే కూర్చుండిపోయింది.నాకు దగ్గు, జ్వరం లాంటివి ఏం లేవు, ఇప్పుడు ఇంట్లోకి రానివ్వకపోతే ఎక్కడికి పోనూ అంటూ ఆ తల్లి కంటతడి పెట్టుకుంది.

అయినా కరోనా ఉంటే హాస్పిటల్ కి తీస్కెళ్లాలి కానీ ఇంటి నుండి గెంటేయడం ఏంటి విడ్డూరం..కన్నతల్లిపట్ల వ్యవహరించాల్సిన తీరేనా ఇది అంటూ స్థానికులు ముక్కున వేలేసుకున్నారు..తీరా కొందరు తిట్టడంతో తల్లిని ఇంట్లోకి రానిచ్చారు. ఎండలో రోడ్డుపై కూర్చున్న శ్యామలమ్మ వీడియో తీసి ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేశారు..ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…ఈ ఘటన చూస్తుంటే ముందు కరోనాకి వ్యాక్సిన్ కాకుండా,జనాలకి  అవగాహన పెంచే మందు కనిపెడితే బాగుంటుంది అనిపిస్తోంది.

 

 


End of Article

You may also like