ఎంతో మంది స్టార్ హీరోల కొడుకులు, కూతుర్లు, అలాగే బంధువులు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. చూస్తూనే ఉంటాం కూడా. ఆ జాబితాలో మరొక లెజండరీ యాక్టర్ మనవరాలు కూడా కూడా చేరబోతున్నారు. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ గారు పరిచయం అక్కర్లేని వ్యక్తి. రాజ్ కుమార్ గారి మనవరాలు అయిన ధన్య రామ్ కుమార్ తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Video Advertisement

ధన్య రామ్ కుమార్ అంతకుముందు ఒక కన్నడ సినిమాలో నటించారు. ఈ సినిమా 2019 లో ప్రకటించారు కానీ ఇంకా విడుదల అవ్వలేదు. ఇప్పుడు ఒక తమిళ సినిమాలో నటించబోతున్నారట. రాజ్ కుమార్ గారి కొడుకులు అయిన శివ రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ కూడా కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన యువరత్న సినిమా తెలుగులో కూడా విడుదల అయ్యింది.