Home Filmy Adda OTT లో సంచలనం సృష్టిస్తున్న నలుగురు అమ్మాయిల కష్టాల కథ…ఎందులో చూడచ్చు అంటే.?

OTT లో సంచలనం సృష్టిస్తున్న నలుగురు అమ్మాయిల కష్టాల కథ…ఎందులో చూడచ్చు అంటే.?

by Sainath Gopi

Ads

యశ్వంత్ కిషోర్ కథా రచన చేసి, దర్శకత్వం వహించిన సినిమా కన్నగి. కీర్తి పాండియన్, అమ్ము అభిరామి, విద్యా ప్రదీప్, షాలిని జోయ నటించిన ఈ సినిమాకి ఫోటోగ్రఫీ రాంజీ, ఎడిటింగ్ కే శరత్ కుమార్, మ్యూజిక్ షాన్ రెహమాన్. ఈ సినిమాకి ఎం గణేష్, జై ధనుష్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా వెండితెరపై విడుదలయి మిశ్రమ స్పందన అందుకుంది.

Video Advertisement

ఫిబ్రవరి మొదటి వారంలో ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా కామ్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది ఈ సినిమా . నలుగురు స్త్రీల కన్నీటి వ్యధ ఈ సినిమా. కథ విషయానికి వస్తే తమిళనాడులోని ఒక ప్రాంతంలో కళై అనే అమ్మాయి తన అమ్మానాన్నలతో ఉంటుంది. ఆమెకి తండ్రి చూసిన పెళ్లిచూపులు సెట్ అవ్వవు. మరొకచోట మరొక అమ్మాయి గీత, తన భర్త విడాకులకి అప్లై చేశాడని, ఆ విడాకులు తనకి ఇష్టం లేదని లాయర్ ని కలుస్తుంది.

మరొక అమ్మాయి నదిగా తను చేసుకోబోయే వాడు చాలా టాలెంటెడ్ అవ్వాలని కోరుకునే మనస్తత్వం కలిగినది. మరొక అమ్మాయి నేత్ర భర్త సినిమాలలో రైటర్ గా ప్రయత్నిస్తూ ఉంటాడు, తన భార్య ప్రెగ్నెంట్ అయితే ఆ ప్రెగ్నెన్సీని తీయించాలి అనే భావనతో ఉంటాడు. ఈ నలుగురు స్త్రీల భిన్నమైన కథలని ఎలాగా లింక్ చేశారు అనేది సినిమా. ఏదీ ఒక కొలిక్కిరాని కథ, ఏది పూర్తవని కథ. కామాలు పెట్టుకుంటూ పోవాల్సిందే తప్ప ఈ కథలకి ముగింపు లేకపోవడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.

ఒక్కొక్క పాత్రని మలిచిన తీరు బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే గజిబిజిగా ఉండటంతో అర్థం చేసుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ మొదట బాగున్నప్పటికీ తర్వాత మెప్పించలేకపోయింది. అయితే ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఓ లుక్కెయ్యొచ్చు. ఇప్పుడు తెలుగు వెర్షన్ లో కూడా అందుబాటులో ఉండటం గమనార్హం


End of Article

You may also like