Home Filmy Adda సినిమా హిట్ అయినంత మాత్రాన వాళ్ళు ఏమీ మారలేదు..! కాంతార హీరో “రిషబ్ శెట్టి” కామెంట్స్..!

సినిమా హిట్ అయినంత మాత్రాన వాళ్ళు ఏమీ మారలేదు..! కాంతార హీరో “రిషబ్ శెట్టి” కామెంట్స్..!

by Mohana Priya

సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగులో రూపొందించిన సినిమాలకు ఎంత ఆదరణ ఉంటుందో, డబ్బింగ్ సినిమాలకు కూడా అంతే ఆదరణ ఉంటుంది. ఒక సినిమా నచ్చితే ఏ భాష సినిమా అయినా సరే తెలుగు ప్రజలు అలాగే ఆదరిస్తారు. అలా ఎన్నో డబ్బింగ్ సినిమాలు తెలుగులో విడుదల అవుతున్నాయి. బహుశా తెలుగులో విడుదల అయిన అన్ని డబ్బింగ్ సినిమాలు మిగిలిన సినిమా ఇండస్ట్రీల్లో విడుదల అవ్వవు ఏమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది.

అంతే కాకుండా ఆ సినిమాల్లో నటించిన హీరోలని కూడా మన తెలుగు ప్రజలు తెలుగు హీరోలాగానే అనుకుంటారు. అలా ఎంతో మంది తమిళ్ హీరోలు తెలుగులో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు తమిళం మాత్రమే కాకుండా ఇతర భాషలకు చెందిన సినిమాలు కూడా తెలుగులో డబ్ అవుతున్నాయి. అలాగే మన సినిమాలు కూడా వేరే భాషల్లోకి డబ్ అవుతున్నాయి.

kantara hero rishab shetty latest interview

అయితే ఇటీవల కన్నడ సినిమాలు కూడా తెలుగులో మంచి గుర్తింపు పొందుతున్నాయి. అలా ఇటీవల విడుదల అయ్యి తెలుగులో కూడా 100 కోట్లు సాధించిన సినిమా కాంతార. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హీరోగా నటించారు. ఈ సినిమాలో నటించడం మాత్రమే కాకుండా సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. కన్నడలో రూపొందిన ఈ సినిమా సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో కూడా డబ్ అయ్యింది. భారతదేశ వ్యాప్తంగా ఈ సినిమా హిట్ గా నిలిచింది.

rishab shetty kantara telugu-movie-story-review-rating

అయితే ఈ సినిమా గురించి ఇందులో హీరోగా నటించిన నటుడు, అలాగే ఈ సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకుడు రిషబ్ శెట్టి మాట్లాడుతూ సినిమా హిట్ అయినందుకు ఆనందంగా ఉంది అని అన్నారు. కానీ ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమీ మారరు అని, తన కుటుంబం తన స్నేహితులు ముందు తనతో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు, అంతే సరదాగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు.

You may also like