Ads
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జ్ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పలువురు సెట్టింగ్ ఎమ్మెల్యే టికెట్లు లేవని తేల్చి చెప్పేశారు.
Video Advertisement
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..
రాయదుర్గం టిక్కెట్ తనకు ఇవ్వలేమని చెప్పారని వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. అయితే తాను ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. వైసిపిని నమ్మి వచ్చినందుకు తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మించి గొంతు కోశారు అని అన్నారు. తన భార్య కాని కొడుకు కానీ రాయదుర్గం నుంచి పోటీ చేస్తారని, తాను మాత్రం కల్యాణదుర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఐదేళ్లు తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనను కలిసేందుకు కూడా సీఎం జగన్ ఇష్టపడకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎవరో చేసిన సర్వేల పేరుతో టిక్కెట్ ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.
ఉదయం నుంచి తాను వేచి ఉన్నప్పటికీ ఎవరూ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి పిలిచి ఈసారి టిక్కెట్ ఇవ్వలేమని చెప్పారు. తనను జగన్ నమ్మించి గొంతు కోశారని ఆయన మండి పడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని నమ్మినందుకు తనకు మోసం చేశారనీ బాధ పడ్డారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ముందు ముందు టిక్కెట్టు దక్కని మరింత మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు ఉంటున్నా
End of Article