“ముందుకెళ్తున్న వాళ్ళని కాళ్ళు పట్టుకొని మరీ వెనక్కి లాగుతారు..!” అంటూ… ఫైర్ అయిన కరాటే కళ్యాణి.? ఏం జరిగిందంటే.?

“ముందుకెళ్తున్న వాళ్ళని కాళ్ళు పట్టుకొని మరీ వెనక్కి లాగుతారు..!” అంటూ… ఫైర్ అయిన కరాటే కళ్యాణి.? ఏం జరిగిందంటే.?

by Mohana Priya

Ads

ఎన్నో సినిమాల్లో నటించి, అలాగే బిగ్ బాస్ ద్వారా మన అందరికీ చేరువైన కరాటే కళ్యాణి గారు ఇటీవల ఫేస్ బుక్ లో లైవ్ చేశారు. ఇందులో, ఇటీవల ఒక సినిమాకు సంబంధించి జరిగిన ఒక విషయంపై మాట్లాడారు కళ్యాణి. కొన్ని రోజుల్లో విడుదల అవ్వబోతున్న ఇప్పుడు కాక ఇంకెప్పుడు అనే ఒక తెలుగు సినిమా వివాదాల్లో చిక్కుకుంది.Karate Kalyani angry in Facebook live

Video Advertisement

ఈ సినిమా ట్రైలర్ లో ఒక రొమాంటిక్ సీన్ నడుస్తున్నప్పుడు వెనకాల భజగోవిందం ప్లే అవుతూ ఉంటుంది. దాంతో పోలీసులకి ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉంది అంటూ ఫిర్యాదు వెళ్ళింది. దాంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విషయం పెద్దది అవ్వడంతో ఈ సినిమా దర్శకుడు యుగంధర్ వచ్చి తప్పు జరిగింది అని ఒప్పుకున్నారు.

Karate Kalyani angry in Facebook live 1

ఇది కావాలని చేసింది కాదు అని, ఈ సినిమాలో ఇంకొక పాట లోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ట్రైలర్ లో వేరే ప్లేస్ లో పెట్టారు అని అన్నారు. అయినప్పటికి కూడా సోషల్ మీడియాలో చర్చ ఆగకపోవడంతో కరాటే కళ్యాణి రంగంలోకి దిగారు. “ఇంత బహిరంగంగా క్షమాపణ చెప్పినా కూడా కేసులు వేస్తున్నారు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఫోన్ చేసి అందరికీ సారీ చెప్పారు. వాళ్లు మనకు విలువ ఇచ్చారు. అది మనం కాపాడాలి. లేదంటే నేనేంటో చూపిస్తా” అని అన్నారు.Karate Kalyani angry in Facebook live 1

ఆ తర్వాత ఫేస్ బుక్ లైవ్ లో పాల్గొని ఈ విషయంపై వివరణ ఇచ్చారు. చాలా మంది తమ సొంత లాభం కోసం ముందుకు వెళ్లేవాళ్లను కూడా కాళ్ళు పట్టి మరీ వెనక్కి లాగుతున్నారు అని, తప్పు జరిగిందని, క్షమించమని అడిగిన తర్వాత కూడా ఇంత రాద్ధాంతం చేయడం తప్పు అని, సొంత గుర్తింపు కోసం కొంత మంది ఇలా చేస్తున్నారు అని అన్నారు.

watch video :


End of Article

You may also like