“ఆ సంస్కారం మా ధర్మంలో లేదు..!” అంటూ… గద్దర్ పై “కరాటే కళ్యాణి” కామెంట్స్..! ఏం అన్నారంటే..?

“ఆ సంస్కారం మా ధర్మంలో లేదు..!” అంటూ… గద్దర్ పై “కరాటే కళ్యాణి” కామెంట్స్..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

ప్రజా గాయకుడు, విప్లవ కవి గద్దర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన తన పాటతో, ఆటతో తెలంగాణ ఉద్యమ సమయంలో స్పూర్తిగా నిలిచారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ చనిపోయిన విషయం తెలిసి లక్షలాది ప్రజల కళ్లు చెమ్మగిల్లాయి.

Video Advertisement

ప్రజా ఉద్యమాల్లో, పోరాటాల్లో ప్రజల తరుపున పోరాటం చేసిన ప్రజా యుద్దనౌక శకం ముగిసిందని, గద్దర్ మరణవార్తతో అంతా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి విషాద సమయంలో టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి గద్దర్ ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
కరాటే కళ్యాణి ప్రజాకవి గద్దర్ మరణ వార్త తెలిసి, ముందుగా పద్ధతిగా ఆయన మరణానికి బాధపడుతూ ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టారు. కాసేపటికి ఫేస్ బుక్ లో వివాదాస్పద పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో ‘బాలు గారు విశ్వనాథ్ గారు సిరివెన్నెల గారు వెళ్లిపోయిన రోజున ఎర్ర బ్యాచ్ ఏమన్నారు మర్చిపోలేదు కానీ పోయినోల్లని తిట్టే సంస్కారం మా ధర్మం లో లే’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ తో గద్దర్ ఫ్యాన్స్ కరాటే కళ్యాణి పై మండిపడ్డారు.
‘మనిషి మరణిస్తే ఇలాంటి పోస్ట్ చేస్తావా? అందువల్లే కదా అందరూ నిన్ను తిట్టేది.. పోయినవాళ్ళని తిట్టడానికి ఎలా మనసు వస్తుంది. నువ్వు అసలు మనిషివేనా? అని ఓరేంజ్‌లో ఆగ్రహిస్తున్నారు. అయితే గద్దర్ అభిమానులు చేస్తున్న కామెంట్లపై కరాటే కళ్యాణి స్పందిస్తూ ఫేస్ బుక్‌లో లైవ్ పెట్టింది. ఆ లైవ్ లో గద్దర్ పాటల పై, గద్దర్ కుమారుడి పై వివాదాస్పద కామెంట్స్ చేసింది. గద్దర్ పాటలతో ఎంతోమంది ప్రభావితం అయ్యి, అడవిబాట పట్టారు. అంతమంది అడవిదారి పడితే, మరి గద్దర్ కుమారుడు అమెరికాలో ఉన్నారు. తాను అయితే ఏ విషయం అయినా మొదట మనం పాటించి, ఆ తరువాత అమలు పరచాలని భావిస్తాను. కానీ గద్దర్ అందర్నీ అడవిదారి పట్టించి, తన కుమారుడిని మాత్రం అమెరికాకు పంపించారు. సోషల్ మీడియాలో పెట్టె పోస్ట్‌లన్ని అందరికీ నచ్చనవసరం లేదు. అందరికి నచ్చేలా పోస్ట్‌లు పెట్టలేం, తిట్టేవాళ్ళు తిడుతూనే ఉంటారు. అలాంటి వారి కోసం తన పద్దతిని మార్చుకోనని, ఎవరు తిట్టినా పట్టించుకోనని, తన పోస్ట్‌లు తన ఇష్టం అని చెప్పుకొచ్చారు.

Also Read: “గద్దర్” చనిపోవడానికి కారణాలు ఇవేనా..? రిపోర్ట్ లో ఏం చెప్పారంటే..?


End of Article

You may also like