Ads
కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తుంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టే క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజలకు అత్యవసర సందర్భాలలో మినహాయించి మిగిలిన ఏ ఇతర సమయాల్లో ఇంటి నుంచి బయటికి రాకూడదని ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.ఈ క్రమంలో మద్యానికి అలవాటైన మందుబాబులు అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు మందుబాబులు మద్యం లభించడం లేదని పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు.
Video Advertisement
కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వాలు మద్యం అమ్మకాల అంశంపై ఆలోచిస్తున్నట్లు పలు మీడియా చానెల్స్ లో చెప్పారు. ఈ పరిస్ధితుల్లో ఏప్రిల్ 14వతేదీ తర్వాత కరోనా లాక్‌డౌన్‌ను పొడిగిస్తే ప్రతీ రోజు ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు రోజుకు 3 గంటల పాటు మద్యం విక్రయించాలని కర్ణాటక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రతిపాదించారు అంట.
కొందరు మందుబాబులు మద్యం లేకపోతే చచ్చిపోతామంటూ చెబుతున్నటువంటి పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజా ఆరోగ్య సమస్యలు మరియు రాష్ట్ర ఆదాయం దృష్టిలో ఉంచుకొని ఎక్సైజ్ శాఖ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.మద్యం కోసం వైన్ దుకాణాల్లో చోరీలు కూడా సాగుతున్న నేపథ్యంలో సర్కారు మద్యం విక్రయించాలని ప్రతిపాదించారంట. దీనిపై కర్ణాటక సీఎం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
source: samayam telugu
End of Article