లాక్ డౌన్ నేపథ్యంలో ఫార్మ్ హౌస్ లో పెళ్లి చేసుకున్న హీరో నిఖిల్…ఫోటోలు మీరే చూడండి.!

లాక్ డౌన్ నేపథ్యంలో ఫార్మ్ హౌస్ లో పెళ్లి చేసుకున్న హీరో నిఖిల్…ఫోటోలు మీరే చూడండి.!

by Sainath Gopi

Ads

కన్నడ హీరో నిఖిల్‌ గౌడ వివాహం అనుకున్న ముహుర్తానికే జరిగింది.లక్షలాది పెళ్లిలు వాయిదా పడ్డాయి. పెళ్లిలు అనేవి అసాధ్యం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ గౌడ పెళ్లికి రెడీ అయ్యాడు.లాక్‌డౌన్ అంశాల మధ్య మాజీ సీఎం కుమారస్వామి తన కుమారుడి వివాహాన్ని జరిపించారు.

Video Advertisement

ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులు కొద్ది మంది బంధు మిత్రలు సమక్షంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నిఖిల్ గౌడ.తన సమీప బంధువు రేవతిని పెళ్లి చేసుకున్న నిఖిల్ గౌడ. బెంగళూరు సమీపంలోని ఒక ఫామ్‌ హౌస్‌లో ఈ పెళ్లిని జరిగింది.పెళ్లికి అక్కడి ప్రభుత్వం కండీషన్స్‌తో కూడిన అనుమతులు ఇవ్వడం జరిగింది.కేవలం ఇరు కుటుంబాల ఫామిలీస్ సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది.

మొదట పెళ్ళికి కూడా అనుమతి ఇవ్వలేదు. తర్వాత కుమారస్వామి ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పించారు. పెళ్ళికి వచ్చిన ఆ కొద్దిమంది తప్పక మాస్కులు ధరించాలి, సామజిక దూరం పాటించాలి అని షరతులు పెట్టారు. ఎక్కువ హడావిడి లేకుండా జరపాలని పెట్టారు. నిఖిల్‌ పెళ్లిని వైభవంగా వంద ఎకరాల స్థలంలో అయిదు లక్షల మంది కార్యకర్తల సమక్షంలో చేయాలని భావించారు. కానీ ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కారణంగా ఇలా చేసారు.కేతగానహళ్లి పట్టణంలోని ఫామ్‌హౌస్‌లో ఈ వేడుకకు నిరాడంబరంగా జరిగింది.


End of Article

You may also like