లేడీ టీచర్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్… అక్కా అక్కా అంటూనే అతను మాస్టర్ ప్లాన్ వేసి..?

లేడీ టీచర్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్… అక్కా అక్కా అంటూనే అతను మాస్టర్ ప్లాన్ వేసి..?

by Mounika Singaluri

కర్ణాటక టీచర్ దీపిక హ-త్య కేసులో ఒక్కొక్కటిగా నిజాలు బయటికి వస్తున్నాయి. మొదట మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ కేసు తరువాత మ-ర్డర్ కేస్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే జనవరి 20వ తేదీన పాఠశాలకు వెళ్లిన దీపిక మూడు రోజుల తర్వాత శవమై కనిపించిన సంగతి తెలిసినదే. స్కూటర్ ఒకచోట ఆమె మృతదోహాన్ని మరొకచోట పోలీసులు గుర్తించారు.దీంతో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాష్ట్రవ్యాప్తంగా దీపిక హ-త్య కేసు వైరల్ అయింది కొండ దిగువన మట్టిలో పాతిపెట్టిన మృతదేహం పోలీసులకు లభ్యమైనది కాగా విచారణ చేపట్టిన పోలీసులు మాణిక్యానహళ్లి గ్రామానికి చెందిన నితీష్ కుమార్ ని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు.

Video Advertisement

దీపికను హతమార్చేందుకు ముందుగా పదకం పన్నాడు నితీష్. అయితే ప్లాన్ కు ఒకరోజు ముందే దీపికను అదే స్థలంలో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు నిందితుడు లేడీ టీచర్లు గొంతును-లిమి హ-త్య చేసి ఊపిరాడకుండా చేసి చంపేసాడని పోలీసులు చెప్తున్నారు. మాణిక్యానహళ్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమార్తె దీపిక అదే గ్రామానికి చెందిన లోకేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది దీపికకు ఒక బిడ్డ కూడా ఉంది.

ఈమె ఎస్ ఇ టి స్కూల్లో టీచర్ గా పని చేసేది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రజలకు కూడా దీపిక సుపరిచితురాలు అయ్యింది. జనవరి 20 న స్కూల్ కి వెళ్ళిన దీపిక తర్వాత ఇంటికి రాకపోవడంతో మిస్సింగ్ కేసు పెట్టారు కుటుంబ సభ్యులు. మేలుకోటే యోగ నరసింహస్వామి కొండ దిగిన ఒక మహిళపై ఒక యువకుడు దాడి చేస్తున్న దృశ్యాన్ని ఒక పర్యాటకుడు చిత్రించి దానిని పోలీసులు అందించాడు. దీని ఆధారంగా పరిసర ప్రాంతాల్లో వెతకగా దీపిక స్కూటర్ లభ్యమయింది.

జనవరి 22వ తేదీన యోగ నరసింహస్వామి కొండ దిగిన దుర్వాసన వెదజల్లుతున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడ మట్టిని తొలగించగా ఉపాధ్యాయురాలు దీపికా మృతదేహం లభ్యమయింది. అయితే దీపిక భర్త నితీష్ గురించి చెప్పి నిత్యం అక్క, అక్క అని పిలిచేవాడు అతనే హ-త్య చేసి ఉండవచ్చు అని చెప్పటంతో అతనిపై నిఘాపెట్టిన పోలీసులు కర్ణాటక బోర్డర్లో నితీష్ ని పట్టుకుని అరెస్టు చేశారు.


You may also like

Leave a Comment