“వంటలక్క” ని మళ్లీ తీసుకొచ్చింది TRP కోసం కాదా..? బిగ్‌బాస్ వల్లనా..?

“వంటలక్క” ని మళ్లీ తీసుకొచ్చింది TRP కోసం కాదా..? బిగ్‌బాస్ వల్లనా..?

by Megha Varna

Ads

కార్తీక దీపం సీరియల్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. కార్తీక దీపం సీరియల్ బాగా పాపులర్ అయ్యింది. బుల్లితెరపై మంచి ప్రేక్షకదారణనను ఈ సీరియల్ సొంతం చేసుకుంది. పైగా ఈ సీరియల్ కి రేటింగ్ కూడా ఎక్కువగానే వచ్చింది. ఎక్కడ చూసిన ఈ సీరియల్ పేరే వినబడేది. ఈ సీరియల్ కధ, పాత్రలు కూడా అందరినీ బాగా ఆకట్టుకున్నాయి.

Video Advertisement

డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత, సౌర్య, హిమ వీళ్లంతా కూడా ఎంతో అద్భుతంగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే వంటలక్క లేక పోవడంతో కాస్త బ్రేక్ వచ్చింది.

కానీ మళ్ళీ డాక్టర్ బాబు, మోనిత, వంటలక్కను మళ్ళీ సీరియల్ లో చూపిస్తున్నారు. దీనికి కారణం రేటింగ్ ఏ కాదు మరొకటి కూడా వుంది. అదే బిగ్ బాస్ షో. బిగ్ బాస్ షో గురించి అందరికీ తెలుసు. దీని గురించి మనం ఏం పరిచయం చెప్పక్కర్లేదు. అన్ని భాషల్లో కూడా ఈ షో బాగా పాపులర్ అయ్యి పోయింది.

తెలుగులో అయితే ఇప్పుడు సీజన్ సిక్స్ నడుస్తోంది. అయితే ఈ షో కి కార్తీక దీపానికి కూడా లింక్ వుంది. పెద్ద వారిగా నటిస్తున్న సౌర్య, హిమ కూడా బిగ్ బాస్ లోకి వచ్చేసారు. దీని మూలంగానే సీరియల్ లో మార్పులు జరిగాయి. కార్తీక దీపం లో హిమ పాత్ర చేసిన కీర్తి భట్ కంటెస్టెంట్ గా తెలుగు బిగ్ బాస్ కి వచ్చింది.

అలానే కన్నడ బిగ్ బాస్ సీజన్ 9 లోకి సౌర్య పాత్ర చేసిన అమూల్య గౌడ వచ్చింది. బిగ్ బాస్ షో కి వస్తే కంటెస్టెండ్స్ కి అవకాశాలు బాగా వస్తాయి. ఈ షో ప్రతి ఒక్కళ్ళనీ బాగా ఆకట్టుకుంటుంది సందేహం లేదు. ఎంతో మంది సెలబ్రెటీలు పాల్గొని ఈ షో లో బాగా సందడి చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ మూలంగానే కార్తీక దీపం సీరియల్ లో మార్పులు వచ్చాయట.


End of Article

You may also like