Home News కార్తీకదీపం “భాగ్యం” నిజజీవిత కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు.! ఇద్దరు పిల్లలు తండ్రి కోసం.?

కార్తీకదీపం “భాగ్యం” నిజజీవిత కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు.! ఇద్దరు పిల్లలు తండ్రి కోసం.?

by Mohana Priya

నటన రంగానికి చెందిన వాళ్లు తెర ముందు ఎలా ఉన్నా కూడా తెర వెనుక వాళ్లు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారు వాటి గురించి మాట్లాడతారు. ఇటీవల కార్తీకదీపం సీరియల్ లో భాగ్యం పాత్ర పోషిస్తున్న ఉమ తన జీవితంలో తాను ఎదుర్కొన్న సమస్యలు గురించి చెప్పారు.

Karthika deepam bhagyam real life story

ఉమ ఎన్నో సంవత్సరాల నుండి సినిమాల్లో, సీరియల్స్ లో ఎన్నో పాత్రల ద్వారా మనల్ని అలరిస్తున్నారు. ఇటీవల స్టార్ మా పరివార్ చాంపియన్ షిప్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఉమ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి చెప్పారు. కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ పాత్ర పోషిస్తున్న నిరుపమ్ పరిటాల ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

Karthika deepam bhagyam real life story

ఈ పెర్ఫార్మెన్స్ చూసి అందరూ ఎమోషనల్ అయ్యారు. ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ లో ఇద్దరు పిల్లలు తమ తండ్రి కోసం తాపత్రయ పడుతున్నట్లు ఉంది.  ఈ పర్ఫార్మెన్స్ చూసి ఉమ కూడా ఎమోషనల్ అయ్యారు. అప్పుడు శ్రీముఖి వచ్చి ఉమని ఓదార్చారు. తన పిల్లలు కూడా తన తండ్రి కోసం అలాగే ఎదురు చూస్తున్నారు అని అన్నారు ఉమ.

Karthika deepam bhagyam real life story

శ్రీముఖి మాట్లాడుతూ, “ఉమ ఒక సింగిల్ మదర్ అని, తనకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని, ఈ విషయాలు అన్నీ బయట వారికి పెద్దగా తెలియవు అని ,తన ఇద్దరు పిల్లలను ఉమ ఎంతో కష్టపడి పెంచారు అని, వారిని ఎంతో బాగా చూసుకొని, ఎంతో ప్రయోజకులను చేశారు అని, ఎప్పటికైనా వారు అందరూ కలిసి సంతోషంగా ఉంటారు” అని చెప్పారు.

You may also like