కార్తీక దీపం సీరియల్ టీవీలో అన్ని షోస్ ని దాటేసింది. ఎంత కొత్త సినిమా వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్‌ వచ్చినా కార్తీక దీపం సీరీయల్‌ చూడకుండా ఉండలేకపోతున్నారట జనం. ఒక వేళ సీరియల్స్ లో కూడా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లాంటివి ఏమైనా ఉంటే ఈ సీరియల్ మాత్రం బ్లాక్ బస్టర్ కేటగిరీ లోకి వస్తుంది.

కార్తీక దీపం సీరియల్ ఒరిజినల్ వెర్షన్ కరుత ముత్తు పేరుతో మలయాళం లో 2014 లో మొదలైంది. ఆ తర్వాత తెలుగులో, కన్నడలో, తమిళ్ లో కూడా రీమేక్ అయ్యింది. కన్నడలో ముద్దు లక్ష్మి పేరుతో ఈ సీరియల్ రీమేక్ అయింది. ఈ సీరియల్ లో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి దీప పాత్ర పోషిస్తున్న ప్రేమి విశ్వనాథ్.

ప్రేమి విశ్వనాథ్ కి తెలుగు లో ఇది మొదటి సీరియల్. అయినా కూడా తన పర్ఫార్మెన్స్ తో సీరియల్ ఇండస్ట్రీలో టాప్ యాక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ప్రేమి విశ్వనాథ్. ప్రేమి విశ్వనాథ్ ఒక లాయర్.  సీరియల్స్ లోకి రాకముందు కొచ్చి లో ఒక ప్రైవేట్ కంపెనీలో  లీగల్ అడ్వైజర్ గా ఉద్యోగం చేసేవారు. ప్రేమి కి ఒక అన్నయ్య ఉన్నారు. ఆయన పేరు శివ ప్రసాద్.

శివ ప్రసాద్ ఒక ఫోటోగ్రాఫర్. శివ ప్రసాద్ కి ఎర్నాకులం లో రెండు స్టూడియోలు ఉన్నాయి. ప్రేమి కూడా వాళ్ళ అన్నయ్య కి ఫోటోగ్రఫీ అసైన్మెంట్స్ కి, అందులోనూ ముఖ్యంగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అసైన్మెంట్స్ కి అసిస్ట్ చేసేవారట. ప్రేమి కి నేచర్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వాళ్లకి ఒక ట్రావెల్ ఏజెన్సీ కూడా ఉంది.

టీవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు వాళ్ళ స్టూడియో కి మోడలింగ్ చేశారు ప్రేమి విశ్వనాథ్. మొదటి సీరియల్ అప్పుడు కెమెరా ఫేస్ చేయకముందు,  తను కెమెరా ఎక్స్పీరియన్స్  చేసింది,  వాళ్ల స్టూడియోకి మోడలింగ్ చేసినప్పుడు మాత్రమే అని ఒక ఇంటర్వ్యూ లో ప్రేమి విశ్వనాథ్ అన్నారు.

premi vishwanath in karutha muthu

 

అలా ఫోటో స్టూడియో కి మోడలింగ్ చేసిన తర్వాత, 2014 లో కరుత ముత్తు సీరియల్ లో కార్తీక పాత్రతో తన కెరీర్ ని మొదలు పెట్టారు. ఈ సీరియల్ లో మొదటి 300 ఎపిసోడ్ల వరకు నటించారు. తర్వాత కొన్ని సీరియల్స్ తో పాటు ఒక మలయాళం లో ఒక ప్రోగ్రాం కి హోస్ట్ గా కూడా చేశారు ప్రేమి విశ్వనాథ్. మళ్లీ తను మలయాళం లో నటించిన అదే కార్తీక పాత్రను తెలుగులో దీప పేరు తో కార్తీకదీపం సీరియల్ లో పోషిస్తున్నారు ప్రేమి విశ్వనాథ్.

ప్రేమి విశ్వనాథ్ మలయాళం నటుడు జయ సూర్య కి బంధువులు అవుతారట. రష్యన్ పార్లమెంట్ ద్వారా  2017 లో  “బెస్ట్ ఆస్ట్రాలజర్ ఆఫ్ ద వరల్డ్ 2017” అవార్డును పొందిన డాక్టర్ టి. ఎస్. వినీత్ భట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రేమి విశ్వనాథ్. ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్, తన భర్తతో కలిసి ఎర్నాకులం లో ఉంటున్నారు.