సీరియల్ లో ఉంటుందా లేదా అని అనుకుంటుంటే…వంటలక్క ఏం చేసిందో తెలుసా?

సీరియల్ లో ఉంటుందా లేదా అని అనుకుంటుంటే…వంటలక్క ఏం చేసిందో తెలుసా?

by Sainath Gopi

Ads

సినిమా హీరోయిన్ అయినా,సీరియల్ హీరోయిన్ అయినా అసలెలా ఉండాలి..తెల్లటి తెలుపు, కోటేరుముక్కు, గులాభిపెదాలంటూ మనకు మనం ఒక ప్రొఫైల్ పెట్టుకున్నాం..అసలు అమ్మాయిలు కూడా అలాగే ఉండాలి అనుకుంటున్నారు..నలుపు రంగుకి ప్రాధాన్యత తక్కువ అనేది అనేక సంధర్బాల్లో స్ఫష్టమయింది..ఇప్పుడు దానిపై కూడా వ్యతిరేకత వస్తుంది అది వేరే విషయం.నలుపుగా ఉన్న కళ ఉండేవాళ్లు చాలా మందే ఉన్నారు..తెల్లగా ఉన్నా వికారంగా కనపడే వారూ ఉన్నారు..నలుపుగా ఉన్నాకూడా తన నటనతో నవ్వుతో కట్టిపడేస్తుంది ప్రేమి విశ్వనాధ్.

Video Advertisement

కార్తీక దీపం సీరియల్ టీవీలో అన్ని షోస్ ని దాటేసింది. ఎంత కొత్త సినిమా వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్‌ వచ్చినా కార్తీక దీపం సీరీయల్‌ చూడకుండా ఉండలేకపోతున్నారట జనం. అంతలా మెప్పించిన కార్తీక దీపం సీరీయల్‌కు వంటలక్క పాత్ర కీలకమైంది. జనం ఆమె యాక్టింగ్‌కు టీవీలకు అతుక్కుపోతున్నారు.మన ఆడియన్స్ అయితే వంటలక్కను తమ ఇంట్లో మనిషిగా భావిస్తున్నారు.

ఇప్పుడు దీపక్క ఫాన్స్ కి ఓ చేదు వార్త. వంటలక్క ప్రేమి విశ్వనాథ్ స్థానంలో మరో నటిని తీసుకోబోతున్నారనే ఈ వార్త టీవీ ఛానెల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.బుల్లితెర మీద 740 ఎపిసోడ్లు దాటి జాతీయ స్థాయిలో టీఆర్పీ రేటింగుల్లో ఆదరగోట్టేస్తోంది ఈ సీరియల్. ఈ సీరియల్ ప్రారంభంలో తక్కువ రెమ్యునరేషన్ కి పని చేయడానికి ఒప్పుకున్నారట ప్రేమి విశ్వనాధ్. అయితే ఇప్పుడు ‘కార్తీకదీపం’ అంచనాలకు మించి క్రేజ్ సంపాదిస్తూ టాప్ ప్లేస్ కి చేరుకుంది. దీంతో ఆమె రెమ్యూనరేషన్ ఏకంగా నాలుగు రేట్లు పేచేసింది అంట.

అంతేకాదు ఆమెకి వేరే ఆఫర్ లు కూడా బాగా రావడంతో…చేసేదేమీ లేక మరో నటిని తీసుకోవాలని ‘కార్తికదీపం’ టీం ఆలోచనలో పడిందట. మరి ఈ వార్త చూసి వంటలక్క ఫాన్స్ పరిస్థితి ఏంటో? మరో టాలీవుడ్ సీనియర్ నటిని వంటలక్క పాత్ర కోసం తీసుకోవాలనుకున్నట్లు టాక్. అభిమానులు మాత్రం ఆమె ప్లేస్ లో మరొకరిని ఊహించుకోలేము అంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ఇది ఇలా ఉండగా…మనం వంటలక్క సీరియల్ లో ఉంటుందా లేదా అనుకుంటున్నా సమయంలో. వంటలక్క మరో పని చేసింది. ఇటీవలే ప్రేమి విశ్వనాథ్ బెంజ్ కార్ కొన్నారు. ఎమోషనల్ గానే కాకుండా డిఫరెంట్ హావభావాలతో ఎంటర్టైన్ చేయగల వంటలక్క బ్రాండ్ ఇప్పుడు మాములుగా లేదు. 60 లక్షల ఖరీదైన బెంజ్ suv కారును కొనుగోలు చేసింది. KL 43L 3444 నెంబర్ తో ఉన్న తన కారు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. సాదరంగా ఈ కారు పెద్ద హీరోలు మాత్రమే వాడుతారు. ఈపాటికే మీకు అర్ధం అయ్యి ఉండాలి వంటలక్క రేంజ్ ఏంటి అని. ప్రేమి ఈ కార్ కొనేసరికి ఇతర సీనియర్ ఆర్టిస్ట్ లు అందరు అవాక్కయ్యారంట. సినిమా వాళ్ళ రేంజ్ ని దాటేసింది గా ప్రేమి అని అనుకుంటున్నారు అంట.


End of Article

You may also like