“కార్తీక దీపం” శౌర్య గురించి ఈ విషయాలు తెలుసా? తండ్రి ఒక బిజినెస్ మ్యాన్.!

“కార్తీక దీపం” శౌర్య గురించి ఈ విషయాలు తెలుసా? తండ్రి ఒక బిజినెస్ మ్యాన్.!

by Mohana Priya

Ads

తెలుగు సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సీరియల్ లో నటించే నటీనటుల అందరూ దాదాపు ప్రతి తెలుగువారి కుటుంబంలో ఒక భాగమైపోయారు. హీరో, హీరోయిన్, సహాయ నటీనటులే కాకుండా చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఈ సీరియల్ లో చాలా బాగా నటిస్తారు. అందుకే ఈ సీరియల్ లో నటించే చిన్న పిల్లలకి కూడా దాదాపు హీరోహీరోయిన్ల కి ఉన్నంత పాపులారిటీ ఉంది.

Video Advertisement

ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ల లో శౌర్య పాత్ర పోషిస్తున్న బేబీ క్రితిక ఒకరు. క్రితిక సీరియల్ లోనే బయట కూడా అంతే హుషారుగా ఉంటుంది. ఇంత చిన్న వయసులోనే పద్యాలు, ఎన్టీఆర్ డైలాగులు చెబుతూ లాక్ డౌన్ లో కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులను అలరిస్తోంది. క్రితిక ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా కనిపించింది అనే విషయం అందరికి తెలిసిందే. ఇంత ప్రతిభావంతురాలైన క్రితిక ఇతరులకి స్వచ్ఛందంగా సేవ చేయడం లో కూడా ఎప్పుడూ ముందు ఉంటుంది.

తనకి 5 ఏళ్ళ వయసున్నప్పటి నుంచి బేబీ క్రితిక సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది. జీ తెలుగులో వచ్చిన గీతాంజలి సీరియల్ ద్వారా సీరియల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది బేబీ క్రితిక. క్రితిక పూర్తి పేరు గ్రంధి క్రితిక అట. క్రితిక తండ్రి వంశీ కృష్ణ ఒక బిజినెస్ మాన్ అట.

క్రితిక కార్తీకదీపం సీరియల్ తో పాటు బావ మరదలు, అక్క మొగుడు సీరియల్స్ లో కూడా నటించింది. షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు క్రితిక.

ఎప్పుడు 85 శాతం కంటే ఎక్కువగా మార్కులు వస్తాయట. అలా క్రితిక నటనలో రాణించడం మాత్రమే కాకుండా చదువులో కూడా ముందుంది.


End of Article

You may also like