కార్తీకదీపం సీరియల్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం టాప్ సీరియల్ ఏది అంటే అందరూ ఆలోచించకుండా చెప్పే సమాధానం కార్తీకదీపం. గత మూడు నాలుగు సంవత్సరాలుగా వస్తున్న ఈ సీరియల్ తెలుగు సీరియల్స్ లో టాప్ గా నిలిచింది.

Video Advertisement

ఒక వేళ సీరియల్స్ లో కూడా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లాంటివి ఏమైనా ఉంటే ఈ సీరియల్ మాత్రం బ్లాక్ బస్టర్ కేటగిరీ లోకి వస్తుంది. ఈ సీరియల్ లో హీరో, హీరోయిన్ తో పాటు అంత గా క్రేజ్ సంపాదించుకున్న పాత్ర మోనిత. మోనితగా నటిస్తున్న నటి పేరు శోభా శెట్టి.  శోభా గత కొంత కాలం నుండి యూట్యూబ్‌లో కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు.

karthika deepam shobha shetty about her struggles

ఇదిలా ఉండగా, శోభా ఇటీవల జీ తెలుగులో ప్రారంభమైన సూపర్ క్వీన్స్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఈ ప్రోగ్రాంకి శోభా తన తల్లితండ్రుల్ని కూడా తీసుకుకొచ్చారు. ఇందులో శోభా మాట్లాడుతూ వారు ముగ్గురు ఆడపిల్లలు అని, ఒక సోదరుడు ఉన్నారు అని, ముగ్గురు ఆడపిల్లలు అనే విషయాన్ని తన తల్లితండ్రులు ఏ నాడు కూడా ఒక సమస్యగా భావించలేదు అని, అసలు అలాంటి భేదాలు ఏమి చూడలేదు అని చెప్పారు. చిన్నప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు అని, శోభా చాలా చిన్నగా ఉన్నప్పుడు వారి తాత (తండ్రి వాళ్ళ తండ్రి ) ఏవో కుటుంబ కలహాల కారణంగా ఆడపిల్ల పుట్టిందని శోభని జోలతో సహా ఇంట్లోనుండి బయటికి విసిరేశారు అని చెప్పారు.

watch video :