Ads
కార్తీక దీపం సీరియల్ టీవీలో అన్ని షోస్ ని దాటేసింది. ఎంత కొత్త సినిమా వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ వచ్చినా కార్తీక దీపం సీరీయల్ చూడకుండా ఉండలేకపోతున్నారట జనం. అంతలా మెప్పించిన కార్తీక దీపం సీరీయల్‌కు వంటలక్క పాత్ర కీలకమైంది. జనం ఆమె యాక్టింగ్‌కు టీవీలకు అతుక్కుపోతున్నారు.మన ఆడియన్స్ అయితే వంటలక్కను తమ ఇంట్లో మనిషిగా భావిస్తున్నారు.
Video Advertisement
అసలు అది సీరియల్ అనే సంగతే మరిచిపోతున్నారు. కార్తీకదీపంలో వంటలక్కను డాక్టర్‌బాబు ఇబ్బందిపెడుతుంటాడు. ఆమెను ప్రతి సందర్భంలోనూ తప్పుగానే అర్థం చేసుకుంటున్నాడు. వంటలక్కను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు డాక్టర్ బాబు అంటూ… టిక్ టాక్‌లో డాక్టర్‌బాబుకు స్పెషల్ రిక్వెస్ట్‌లు, సలహాలు, సూచనలు ఇస్తూ వంటలక్క కోసం మొరపెట్టుకుంటున్నారు. సీరీయల్ ప్రభావం మరీ ఇంత ఉందా అని కొందరు, అవును ఆ సీరీయల్ బావుంటందని కొందరు, ఇంట్లో వాళ్లతో అలవాటైపోయింది. తప్పటం లేదు కానీ బాగానే ఉంటుందని కొందరు కార్తీకదీపం సీరీయల్‌పై వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే…త్వరలో ఐపీఎల్ మొదలవ్వబోతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఐపీఎల్ మ్యాచ్ మొదలయ్యే టైం 7 :30 . స్టార్ మా లో కార్తీక దీపం సీరియల్ వచ్చే టైం కూడా అదే. దీంతో ఓ అభిమాని “sir please change the timing of @ఐపీల్ from 7:30pm to 8:00pm because at 7:30pm our family will watch #KarthikaDeepam and we have only one TV in my house .so please change the timings sir and avoid conflicts in my house ” అంటూ ట్వీట్ చేసారు. స్టార్ మా ఆ ట్వీట్ ని పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. దానిపై అనేక మీమ్స్ కూడా వచ్చాయి. ఓ లుక్ వేయండి.
1.
2.
3.
4.
5.
End of Article