అమ్మబాబోయ్!!! వంటలక్క ఫాన్స్ ఏంటి ఇలా ఉన్నారు? ఆమెకోసం ఏం చేసారో తెలుసా?

అమ్మబాబోయ్!!! వంటలక్క ఫాన్స్ ఏంటి ఇలా ఉన్నారు? ఆమెకోసం ఏం చేసారో తెలుసా?

by Megha Varna

సినిమా హీరోయిన్ అయినా,సీరియల్ హీరోయిన్ అయినా అసలెలా ఉండాలి..తెల్లటి తెలుపు, కోటేరుముక్కు, గులాభిపెదాలంటూ మనకు మనం ఒక ప్రొఫైల్ పెట్టుకున్నాం..అసలు అమ్మాయిలు కూడా అలాగే ఉండాలి అనుకుంటున్నారు..నలుపు రంగుకి ప్రాధాన్యత తక్కువ అనేది అనేక సంధర్బాల్లో స్ఫష్టమయింది..ఇప్పుడు దానిపై కూడా వ్యతిరేకత వస్తుంది అది వేరే విషయం.నలుపుగా ఉన్న కళ ఉండేవాళ్లు చాలా మందే ఉన్నారు..తెల్లగా ఉన్నా వికారంగా కనపడే వారూ ఉన్నారు..నలుపుగా ఉన్నాకూడా తన నటనతో నవ్వుతో కట్టిపడేస్తుంది ప్రేమి విశ్వనాధ్.

Video Advertisement

స్టార్ మా లో కార్తీక దీపం అనే సీరియల్ వస్తుంది..బుల్లితెర హీరో నిరుపమ్ లీడ్ రోల్ పోషిస్తున్న సీరియల్లో ,అతడి సరసన ఇద్దరు నటీమణులు నటిస్తున్నారు..వారిలో ఒకరు ప్రేమి విశ్వనాధ్..మేనిఛాయ నలుపు అయినప్పటికీ ఆకట్టుకునే రూపం..నటన..వాస్తవానికి ప్రేమి శరీర రంగు నలుపు కాదు..ఆవిడేంటి అలా ఉంది..ఆమెని సీరియల్లోకి ఎలా తీసుకున్నారు అనుకుని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసిన వారికి ప్రేమి అసలైన ఫోటోలు చూసి ఆశ్చర్యపోయారు.

ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ టీవీలో అన్ని షోస్ ని దాటేసింది. ఎంత కొత్త సినిమా వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్‌ వచ్చినా కార్తీక దీపం సీరీయల్‌ చూడకుండా ఉండలేకపోతున్నారట జనం. అంతలా మెప్పించిన కార్తీక దీపం సీరీయల్‌కు వంటలక్క పాత్ర కీలకమైంది. జనం ఆమె యాక్టింగ్‌కు టీవీలకు అతుక్కుపోతున్నారు.

మన ఆడియన్స్ అయితే వంటలక్కను తమ ఇంట్లో మనిషిగా భావిస్తున్నారు. అసలు అది సీరియల్ అనే సంగతే మరిచిపోతున్నారు. కార్తీకదీపంలో వంటలక్కను డాక్టర్‌బాబు ఇబ్బందిపెడుతుంటాడు. ఆమెను ప్రతి సందర్భంలోనూ తప్పుగానే అర్థం చేసుకుంటున్నాడు. వంటలక్కను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు డాక్టర్ బాబు అంటూ… టిక్‌ టాక్‌లో డాక్టర్‌బాబుకు స్పెషల్ రిక్వెస్ట్‌లు, సలహాలు, సూచనలు ఇస్తూ వంటలక్క కోసం మొరపెట్టుకుంటున్నారు. సీరీయల్‌ ప్రభావం మరీ ఇంత ఉందా అని కొందరు, అవును ఆ సీరీయల్ బావుంటందని కొందరు, ఇంట్లో వాళ్లతో అలవాటైపోయింది. తప్పటం లేదు కానీ బాగానే ఉంటుందని కొందరు కార్తీకదీపం సీరీయల్‌పై వ్యాఖ్యానిస్తున్నారు.


You may also like

Leave a Comment