గత ఏడాది ఈ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు పెళ్లి చేసుకుంటున్నారు. కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాకుండా మిగిలిన ఇండస్ట్రీలకు చెందిన వారు కూడా ఈ జాబితాలో చేరుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో హీరో కూడా యాడ్ అయ్యారు. ఎక్కడా తెలియకుండా అసలు ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా సడన్ గా ఆ హీరో ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యి వైరల్ అవుతున్నాయి.karthikeya announces his engagement

వివరాల్లోకి వెళితే, ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కార్తికేయ నిశ్చితార్థం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలకి సినీ ప్రముఖులు ఎవరూ హాజరు కాలేదు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ కార్తికేయ ఇవాళ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఫోటోలు షేర్ చేశారు.karthikeya announces his engagement

11 సంవత్సరాల క్రితం ఫోటో, అలాగే ఎంగేజ్మెంట్ ఫోటో షేర్ చేస్తూ కార్తికేయ ఈ విధంగా రాశారు. “నా బెస్ట్ ఫ్రెండ్, అలాగే ఇప్పుడు నా పార్ట్నర్ కాబోతున్న వ్యక్తితో నా ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. 2010లో ఎన్ఐటి వరంగల్ లో నేను లోహితని కలిసినప్పటి ఫోటో నుంచి ఇప్పటి వరకు” అని రాశారు. కార్తికేయ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు లోహిత రెడ్డి. దాంతో ఎంతో మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కార్తికేయ, లోహిత లకి విషెస్ తెలుపుతున్నారు.