Ads
- చిత్రం : షెహజాదా
- నటీనటులు : కార్తీక్ ఆర్యన్, కృతి సనన్, పరేష్ రావల్, మనీషా కొయిరాలా, రోనిత్ రాయ్.
- నిర్మాత : భూషణ్ కుమార్, అల్లు అరవింద్ ఎస్ రాధా కృష్ణ, అమన్ గిల్, కార్తీక్ ఆర్యన్
- దర్శకత్వం : రోహిత్ ధావన్
- సంగీతం : ప్రీతమ్
- విడుదల తేదీ : ఫిబ్రవరి 17, 2023
Video Advertisement
స్టోరీ :
వాల్మీకి (పరేష్ రావల్) చేసిన ఒక పని వల్ల బంటు (కార్తీక్ ఆర్యన్) వాల్మీకి కొడుకుగా పెరుగుతాడు. బంటు చేసే కంపెనీలో తన బాస్ అయిన సమైరా (కృతి సనన్) తో ప్రేమలో పడతాడు. తర్వాత బంటుకి వాల్మీకి తన తండ్రి కాదు అనే నిజం తెలుస్తుంది. ఆ తర్వాత తన తల్లిదండ్రులని కలుసుకోవడానికి వెళ్తాడు. బంటు వారి కొడుకు అన్న విషయం తన సొంత తల్లిదండ్రులకి తెలిసిందా? అక్కడ బంటు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? అసలు వాల్మీకి ఏం చేశాడు? ఎందుకు వేరే అబ్బాయిని తీసుకొచ్చి పెంచుకున్నాడు? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యింది అనే సంగతి అందరికీ తెలుసు. సరిగ్గా లాక్ డౌన్ కి ముందు విడుదల అవ్వడంతో, ఆ తర్వాత ప్రాంతీయ చిత్రాలకు కూడా ఎక్కువ గుర్తింపు రావడంతో ఈ సినిమా చాలా మంది చూశారు. ఒక రకంగా పుష్ప సినిమా కంటే ముందే అల్లు అర్జున్ కి ఈ సినిమా ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పాటలు, అందులో అల్లు అర్జున్ చేసిన డాన్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు ఈ సినిమా రీమేక్ అంటే, “అల్లు అర్జున్ చేసినంత బాగా ఆ హీరో చేయడం కష్టం, కాబట్టి అదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవ్వదు” అని కామెంట్స్ రావడం మొదలు అయ్యాయి. అసలు అల వైకుంఠపురములో సినిమా కథ చూసుకున్నా కూడా చాలా రొటీన్ కథ. కేవలం టేకింగ్ వల్ల, అలాగే పాటల వల్ల సినిమా చాలా పెద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. హిందీలో కథ విషయంలో పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు.
హీరో పేరు కూడా అలాగే ఉంచేశారు. అంతే కాకుండా కొన్ని డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి. కానీ హిందీ నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేశారు. అసలు ఒక రకంగా ఈ సినిమాని రీమేక్ చేయడమే పెద్ద సాహసమైన పని అని చెప్పాలి. కానీ చాలా వరకు డైరెక్టర్ రోహిత్ ధావన్ తెలుగు సినిమాలో ఉన్న ఆ ఎమోషన్స్ అన్ని హిందీ సినిమాలో కూడా ఉండేలాగా చూసుకున్నారు. రీమేక్ అనే విషయం పక్కన పెట్టి చూస్తే సినిమా అన్ని రకాలుగా కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది.
ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు ఉన్నారు. వాళ్లు వారి పాత్రల పరిధి మేరకు నటించారు. హీరోగా నటించిన కార్తీక్ ఆర్యన్ కూడా అల్లు అర్జున్ తో పోల్చకుండా చూస్తే తన స్టైల్ లో చాలా బాగా చేశారు అని అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కార్తీక్ ఆర్యన్ కి స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టే సినిమా ఇది అయ్యే అవకాశం కూడా ఉంది.
ప్లస్ పాయింట్స్:
- నటీనటులు
- లొకేషన్స్
- నిర్మాణ విలువలు
- పాటలు
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ
- సెకండ్ హాఫ్ లో ల్యాగ్ అనిపించే కొన్ని సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్:
రీమేక్ అనే విషయం పక్కన పెట్టి, అసలు తెలుగు సినిమాతో పోల్చకుండా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చూద్దాం అనుకునే వారికి షహజాదా సినిమా అస్సలు నిరాశపరచదు. కామెడీ తో పాటు ఎమోషన్స్ కూడా ఉండడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకి సినిమా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనడంలో సందేహం లేదు.
watch trailer :
End of Article