Ads
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో ఒక వివాహిత కాలువలోకి దూకడం కలకలం రేపింది. ఆ సమయంలో ఆమె భర్త పక్కనే నిల్చుని ఫోన్ మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
Video Advertisement
ఉంగుటూరు మండలంలోని అక్కుపల్లి గోకవరం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు టీచర్ గా పనిచేస్తున్నారు. అతనికి తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు గ్రామానికి చెందిన కస్తూరి అనే అమ్మాయితో ఈ ఏడాది మొదట్లో జనవరిలో పెళ్లి జరిగింది.
శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లాలోని వెలివెన్ను గ్రామంలో ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా వర్క్ చేస్తున్నాడు. అతని భార్య కస్తూరి గృహిణి, ఆమె అత్తగారింటిలో ఉంటోంది. అయితే కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్యన మనస్పర్థలు రావడంతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు రాత్రి కూడా భార్యాభర్తల మధ్య మళ్ళీ గొడవ జరిగింది. దాంతో శ్రీనివాసరావు తల్లిదండ్రులు కస్తూరిని కొద్ది రోజులు కొవ్వూరులోని ఆమె పుట్టింట్లో ఉంచమని చెప్పారు.
శ్రీనివాసరావు శుక్రవారం పొద్దున్నే భార్య కస్తూరిని కొవ్వూరులోని పుట్టింట్లో దించేందుకు ఆమెను తీసుకుని బైక్ మీద బయలుదేరాడు. నల్లజర్ల మండలంలోని అనంతపల్లి పోలవరం కుడి కాలువ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసరికి శ్రీనివాసరావుకు కాల్ వచ్చింది. వెంటనే అతను బైక్ ఆపి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు చెప్పు పడిపోయిందని దాన్ని తెచ్చుకుంటానని చెప్పి, వెనక్కి వెళ్లి కస్తూరి భర్త కళ్లముందే కాలువలోకి దూకింది.
కాలువలో కస్తూరి కొట్టుకుపోతున్నా కూడా ఆమెను కాపాడేందుకు ఎవరూ ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. కొంత దూరం వరకు నీళ్లపై కనిపించిన ఆమె ఆ తర్వాత నీటిలో మునిగిపోయింది. ఆమె భర్త నలజర్ల పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మిస్సింగ్ కేసుగా రిజిస్టర్ చేసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికించారు. అయినా కస్తూరి ఆచూకీ దొరకలేదు. కొంతకాలం నుండి భార్యా భర్తల మధ్య తరచూ జరుగుతున్న గొడవల నేపథ్యంలోనే కస్తూరి కాలువలో దూకేసి ఉండవచ్చని సందేహిస్తున్నారు.
Also Read: ఎటువంటి గాయలు లేవా..? భవ్యశ్రీ కేసులో పోలీసులు బయటపెట్టిన నిజాలు ఏంటంటే..?
End of Article