తిరుమల శ్రీవారి గోవింద కోటి రాసిన ఈ అమ్మాయి ఎవరు..? టీటీడీ వారు ఏం చేశారు అంటే..?

తిరుమల శ్రీవారి గోవింద కోటి రాసిన ఈ అమ్మాయి ఎవరు..? టీటీడీ వారు ఏం చేశారు అంటే..?

by Mohana Priya

Ads

తిరుమల శ్రీవారికి భక్తులు ఒక్కొక్కరు తమకి చేతనైన విధంగా తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. కొంత మంది భక్తులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. మరి కొంత మంది భక్తులు ఏమో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కొంత మంది నగలు, ఆభరణాలు సమర్పిస్తారు. అయితే బెంగళూరుకి చెందిన ఒక అమ్మాయి తనదైన రీతిలో తన భక్తి చాటుకుంది. వివరాల్లోకి వెళితే, కొంత కాలం క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం వారు గోవింద కోటి పేరుతో ఒక కార్యక్రమాన్ని పరిచయం చేశారు.

Video Advertisement

keerthana tirupati govinda nama koti.

మొదటి గోవింద కోటిని బెంగళూరుకి చెందిన 17 సంవత్సరాల కీర్తన అనే వ్యక్తి పూర్తి చేశారు. ఆరు నెలలకు వ్యవధిలో కీర్తన 1001116 సార్లు గోవింద నామాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని తిరుమలకి వెళ్లి అక్కడ ఉన్న ఆర్జితం కార్యాలయంలో ఇచ్చారు కీర్తన. పాలకమండలి వారు కీర్తనతో పాటు ఆమె కుటుంబ సభ్యులందరికీ వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యాన్ని కల్పించారు. గత మంగళవారం ఉదయం కీర్తన తన కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారి మొక్కు తీర్చుకున్నారు. కీర్తన కుటుంబం అంతా కూడా వెంకటేశ్వర స్వామిని ఇలవేల్పుగా భావిస్తారు.  దాంతో కీర్తన గోవింద కోటి రాయాలి అని అనుకున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రవేశపెట్టిన గోవింద కోటి పూర్తి చేసిన మొదటి వ్యక్తి తానే అవ్వడం చాలా సంతోషంగా ఉంది అని కీర్తన తెలిపారు. రామకోటి లాగానే తిరుమల తిరుపతి దేవస్థానం గోవింద కోటిని ప్రవేశపెట్టారు. గోవింద కోటిని పూర్తిచేసిన 25 ఏళ్లలోపు ఉన్నవారికి, వారి కుటుంబ సభ్యులతో పాటు, తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల స్వామి వారి బ్రేక్ దర్శన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. కుటుంబంలో ఉన్న ఐదుగురు కుటుంబ సభ్యులతో కలిసి బ్రేక్ దర్శనంలో వెళ్లి దేవుడిని దర్శించుకునే వసతిని కల్పించారు. అలా మొదటిగా గోవింద నామాన్ని కోటి సార్లు రాసిన కీర్తన, తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి, తిరుమల తిరుపతి దేవస్థానంలో తన పుస్తకాన్ని సమర్పించి, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్నారు.

ALSO READ : “భారత స్వతంత్ర” పోరాటంలో… దేశం కోసం పోరాడిన 10 “మహిళా” స్వాతంత్ర సమరయోధులు వీరే..!


End of Article

You may also like