“ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాం… అంబానీ హోటల్ అయినా కూడా..!” అంటూ… “నెగిటివ్ కామెంట్స్” పై కీర్తి భట్ భర్త రియాక్షన్..! ఏం అన్నారంటే..?

“ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాం… అంబానీ హోటల్ అయినా కూడా..!” అంటూ… “నెగిటివ్ కామెంట్స్” పై కీర్తి భట్ భర్త రియాక్షన్..! ఏం అన్నారంటే..?

by Mohana Priya

Ads

ఇటీవల సీరియల్ నటి కీర్తి భట్, తన భర్త కార్తీక్ తో కలిసి ఎంతో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్లి భోజనం చేశారు. అక్కడ భోజనం అందరూ బాగుంది అన్నా కూడా, కీర్తి తనకి నచ్చలేదు అని చెప్పారు. ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు అనే విషయం కూడా అర్థం కాలేదు అని, కారం చాలా ఎక్కువగా ఉంది అని, కుమారి ఆంటీ కంటే చికెన్ తనే బాగా చేస్తాను అని అన్నారు. ఈ వీడియో షేర్ చేసిన తర్వాత కీర్తి చాలా నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొన్నారు.

Video Advertisement

keerthi bhat husband reaction on negative comments on kumari aunty video

వాళ్లు అలా ప్రచారం చేయడం వల్ల కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్లే వారి సంఖ్య తగ్గిపోతుంది అని, ఆమె బిజినెస్ దెబ్బ తింటుంది అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ఈ వీడియో పెట్టి 2 వారాలు దాటినా కూడా ఇంకా దీని ప్రభావం తగ్గలేదు. కీర్తి పెట్టిన పోస్ట్ కింద కానీ, లేదా కీర్తి ఏదైనా కొత్త వీడియో షేర్ చేసినా కూడా, ఆ వీడియో కింద కూడా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ గురించి కీర్తి చేసిన కామెంట్స్ గురించి ఏవో ఒక రిప్లైలు ఉంటూనే ఉన్నాయి. దాంతో ఈ విషయం మీద కీర్తి భర్త స్పందించారు. “కుమారి ఆంటీ గారి ఫుడ్ స్టాల్ కి వెళ్లి మేము వీడియో చేసి షేర్ చేసాము.”

“అక్కడ ఫుడ్ చాలా కారంగా ఉంది అని చెప్పాం. దాంతో అందరూ కూడా మీరు ఆంధ్రా వాళ్ళు. మీరు కారం ఎక్కువగా తినరు. తెలంగాణ వాళ్ళం కారం ఇలాగే తింటాం. అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ నేను రాయలసీమ వాడిని. మేము అలా చెప్పడం వల్ల కుమారి ఆంటీ బిజినెస్ కి ఏం నష్టం రాలేదు. ఒకవేళ పెద్ద హోటల్ కి వెళ్తే అక్కడ ఫుడ్ బాగాలేకపోతే ఇలాగే చెప్తారా అని అడుగుతున్నారు. ఎక్కడైనా సరే ఫుడ్ బాగుంటే బాగుంది అని చెప్తాం. బాలేదు అంటే బాలేదు అని చెప్తాం. అది అంబానీ హోటల్ అయినా సరే” అంటూ కార్తీక్ రిప్లై ఇచ్చారు.

watch video :

ALSO READ : రాఘవేంద్రరావు, రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన 11 సినిమాలు ఏంటో తెలుసా.? ఎన్ని హిట్ అంటే.?


End of Article

You may also like