కీర్తి సురేష్ నటించిన “పెంగ్విన్” సినిమా రివ్యూ..!

కీర్తి సురేష్ నటించిన “పెంగ్విన్” సినిమా రివ్యూ..!

by Mohana Priya

Ads

చిత్రం : పెంగ్విన్
నటీనటులు : కీర్తి సురేష్, లింగా, రఘు, మాస్టర్ అద్వైత్
నిర్మాత : కార్తీక్ సుబ్బరాజ్
దర్శకత్వం : ఈశ్వర్ కార్తీక్
సంగీతం : సంతోష్ నారాయణన్
విడుదల తేదీ : జూన్ 19, 2020 (అమెజాన్ ప్రైమ్)

Video Advertisement

కథ :
అజయ్(మాస్టర్ అద్వైత్) కి తల్లి రిథమ్ (కీర్తి సురేష్). రిథమ్ రెండోసారి ప్రెగ్నెంట్ గా ఉంటుంది. ఆ సమయంలో తన మొదటి బిడ్డ అజయ్ అదృశ్యం అవుతాడు. చార్లీ చాప్లిన్ వేషం లో వచ్చిన ఒక వ్యక్తి అజయ్ ని కిడ్నాప్ చేస్తాడు. రిథమ్ పోలీసుల సహాయంతో అజయ్ ని వెతకడం, దొంగ ఎక్కడున్నాడో తెలుసుకోవడం తో కథ ముందుకు సాగుతుంది. అజయ్ దొరికాడా? అసలు అజయ్ ఆ వ్యక్తి ఎందుకు కిడ్నాప్ చేశాడు ? రిథమ్ దొంగను కనిపెట్ట గలిగిందా ? అసలు ఆ చార్లీచాప్లిన్ మాస్క్ వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు ? తనకి రిథమ్ కి ఏంటి సంబంధం ? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

డైరెక్ట్ తెలుగు సినిమా కాకపోయినా లాక్ డౌన్ సమయంలో అమెజాన్ ప్రైమ్ లో  రిలీజ్ అయిన మొదటి తెలుగు సినిమా ఇదే. దాంతో తెలుగు ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి నెలకొంది. డబ్బింగ్ అయినా పర్లేదు అని అనుకున్నారు. కానీ అదే కొంచెం నిరాశపరిచింది. హడావిడి వల్లనో ఏమో కానీ డబ్బింగ్ సరిగ్గా సింక్ అయినట్టు అనిపించదు. సినిమా చూస్తున్నంత సేపు ఏదో మిస్ అవుతుంది అన్న భావన కలుగుతుంది. ట్విస్టులు కూడా చాలా సినిమాల్లో చూసిన వాటిలానే అనిపిస్తాయి.

దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ సస్పెన్స్ ని సినిమా మొత్తం కొనసాగించినా కానీ ప్రేక్షకుడికి ఎక్కడ థ్రిల్ అయ్యే అంశాలు కనిపించవు. దృష్టి మొత్తం కీర్తి సురేష్ పాత్ర మీద ఉండటంతో మిగిలిన పాత్ర లని సరిగ్గా డెవలప్ చేయలేదేమో అనిపిస్తుంది. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా వాతావరణాన్ని క్రియేట్ చేసింది.

సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి బలం. కీర్తి సురేష్ కి వంక పెట్టడానికి ఒక్క కారణం కూడా లేదు. సినిమాని మొత్తం తన భుజాల పైనే మోసింది. నటనలో ఎక్స్ప్రెషన్ లలో ఆమెకి ఫుల్ మార్కులు వేయొచ్చు. అలాగే అజయ్ పాత్రలో చేసిన మాస్టర్ అద్వైత్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు.

ప్లస్ పాయింట్స్ :

కీర్తి సురేష్
సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
లొకేషన్స్

మైనస్ పాయింట్స్ :

జనాలకి ఆల్రెడీ తెలిసిన కథ,
ఊహించగలిగే ట్విస్టులు,
ఎడిటింగ్
అతికించినట్టు ఉన్న డబ్బింగ్

రేటింగ్ :  3/5

ట్యాగ్ లైన్ : ఎలాంటి అంచనాలు లేకుండా మామూలుగా ఏదో ఒక సినిమా చూద్దాం అనుకున్న సగటు ప్రేక్షకుడిని నిరాశపరచదు. అదే సస్పెన్స్ సినిమా, సైకో కిల్లర్ సినిమా, చాలా ట్విస్టులు ఉంటాయేమో అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఒక యావరేజ్ సినిమాగా అనిపించొచ్చు.

 


End of Article

You may also like